RC17 Update: పెద్ది సినిమా పూర్తవడంతో చరణ్ – సుక్కుల కాంబినేషన్ ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్ డేట్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది.
అవును సుక్కు కాంబోలో వచ్చే ‘RC17’ కోసం చరణ్ ఏకంగా 15 కిలోల వరకు బరువు తగ్గబోతున్నాడని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు చూసిన లుక్స్‌కు పూర్తి భిన్నంగా స్లిమ్‌గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడని ఇన్ సైడ్ టాక్.
అంతేకాదండోయ్ ..ఈ సినిమాలో చరణ్ లాంగ్ హెయిర్‌తో కూడా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అంటే హెయిర్ నుంచి బాడీ వరకు మొత్తం లుక్‌ను మార్చేయబోతున్నాడన్నమాట.ఇక ఈ న్యూస్ బయటకు ఇలా వచ్చిందో లేదో ‘RC17’లో చరణ్ ఎలా కనిపిస్తాడా అని ఫ్యాన్స్‌లో అప్పుడే క్యూరియాసిటీ మొదలైంది.
సుకుమార్ సినిమా అంటేనే హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండటం కామన్. గతంలో ‘రంగస్థలం’ కోసం రామ్ చరణ్‌ను చిట్టిబాబుగా పూర్తిగా మార్చేసిన సుకుమార్.. ఇప్పుడు ‘RC17’లో కూడా మరో కొత్త అవతార్‌లో చూపించబోతున్నాడట.
అప్పట్లో చిట్టిబాబు లుక్ బయటకు వచ్చినప్పుడు ఎంత హైప్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన లుక్ కూడా అదే రేంజ్‌లో ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా కోసం చరణ్ బరువు తగ్గడం వెనుక కూడా క్యారెక్టర్ అవసరమే కారణమని తెలుస్తోంది. పాత్ర ఎలా ఉండాలి? హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? అనే విషయాలపై సుకుమార్ చాలా క్లారిటీగా ఉన్నాడట.అందుకే చరణ్ కూడా డైరెక్టర్ చెప్పినట్లుగా తన ఫిజిక్‌ను మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం.
ప్రస్తుతం చరణ్ చేతి గాయం నుంచి కోలుకుంటున్నాడు. పూర్తిగా రికవరీ అయిన తర్వాత ‘RC17’ కోసం స్పెషల్ ట్రైనింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందట.బరువు తగ్గడంతో పాటు ఫిట్‌నెస్, లుక్, హెయిర్‌స్టైల్.. ఇలా అన్నింటిపైనా స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నాడట. షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి కొత్త చరణ్‌ను ప్రేక్షకులకు చూపించాలనేది ప్లాన్‌గా తెలుస్తోంది.
ఇక సుకుమార్ కూడా ఈ సినిమాను మామూలు సినిమాలా కాకుండా చాలా పెద్ద స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నాడట. ‘పుష్ప’తో పాన్ ఇండియా లెవల్లో తన మార్క్ చూపించిన సుకుమార్.. ఇప్పుడు రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాను కూడా నేషనల్ వైడ్ గా భారీ స్కేల్ లో ఉండే విధంగా స్టోరీని రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇక ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ కథ దాదాపు పూర్తయిందని, ప్రస్తుతం క్లైమాక్స్‌పై సుకుమార్ వర్క్ చేస్తున్నాడని సమాచారం.సుకుమార్ సినిమాల్లో క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంట్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాల్లో క్లైమాక్స్ ఎలా వర్కవుట్ అయిందో తెలిసిందే.
దీంతో ‘RC17’ క్లైమాక్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని ఆశలు పెంచేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.
ఇక ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఉండటానికి మరో కారణం ‘రంగస్థలం’. చరణ్ కెరీర్‌లోనే ఆ సినిమా ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. చిట్టిబాబు పాత్రలో చరణ్ చేసిన పెర్ఫార్మెన్స్‌కు ఏ విధమైన రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు.
ఇప్పుడు అదే సుకుమార్ మళ్లీ చరణ్‌ను డిఫరెంట్ షేడ్‌లో చూపిస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
also read :వామ్మో, ఎన్టీఆర్ కోలుకోడానికి అంత టైమ్ పడుతుందా? డాక్టర్లు ఏం చెప్పారంటే?
అయితే 15 కిలోలు తగ్గడం, లాంగ్ హెయిర్ పెంచుకోవడం వంటి విషయాలపై ఇప్పటివరకు మేకర్స్ నుండి ఎలాంటి అప్ డేట్ అయితే రాలేదు.చూడాలి మరి ముందు ముందు ఇదే నిజమని అఫీషియల్ గా క్లారిటీ ఇస్తారా, లేక అంతకు మించి అంటూ అనౌన్స్ చేస్తారా!