Hyderabad City: కొన్నాళ్లుగా వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఏడుగుల బంధంతో ఒకటి కావాలని డిసైడ్ అయ్యారు. అంతా బాగానే జరుగుతున్న సమయంలో విధి ఆడిన నాటకంలో యువకుడు మృతి చెందాడు. ప్రియుడు లేకపోవడం తట్టుకోలేక యువతి, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శంషాబాద్ ప్రాంతంలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
హైదరాబాద్ సిటీ శంషాబాద్ ప్రాంతంలోని సిద్ధేశ్వర కాలనీలో నర్మద అనే 19 ఏళ్ల యువతి ఉంటోంది. ఈమె నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ను ప్రేమించింది. అయితే ప్రేమను కాస్త వివాహ బంధంగా మార్చుకోవాలని ఇద్దరు అనుకున్నారు. పెద్దలు కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరి విషయంలో దైవం ఆలోచన మరోలా ఉంది. సరిగ్గా రెండు వారాల కిందట రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ్ మృతి చెందాడు. దీంతో ఆనాటి నుంచి నర్మద తీవ్ర మనస్తాపానికి గురైంది.
అడుగు తీసి మరొక అడుగు వేసేసరికి ప్రియుడు గుర్తుకు రావడం మొదలైంది. నిద్రపోతున్నా ప్రియుడు పదేపదే గుర్తుకు వచ్చేవాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు నర్మద చెప్పుకొచ్చింది. కలలోకి వచ్చి తన దగ్గరకు సిద్ధార్థ్ రమ్మంటున్నారని పలుమార్లు చెప్పింది. నీవు లేని నేను ఉండలేనంటూ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు బయట నుంచి ఇంటికి వచ్చేసరికి నర్మద విగతజీవిగా కనిపించడంతో షాకయ్యారు.
నర్మద మృతిపై కేసు నమోదు అయ్యింది. రంగంలోకి దిగిన ఆర్జీఐఏ పోలీసులు, విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా తరలించారు. తరలించారు. నర్మద కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరి పోలీసులు విచారణలో ఏం తేలుతుందో చూడాలి.