Karthika Deepam 2 serial today Episode: కొన్ని అబ్బాయిల ఫోటోలు తీసుకొచ్చి జ్యోత్స్న ముందు వేస్తుంది పారిజాతం. ఏంటని జ్యోత్స్న అడిగితే ఇందులో ఒక ఫోటో సెలెక్ట్ చేయ్ ఆ వ్యక్తితోనే నీకు పెళ్లి చేస్తామంటుంది పారిజాతం. జ్యోత్స్న కోపంగా నాకు అవసరం లేదు.. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ బయటకు వెళ్లి అందరినీ నిలదీస్తుంది. ఎవరు ఈ సంబంధాలు తీసుకొచ్చింది అంటూ నిలదీస్తుంది. ఈ సంబంధాలు ఎవ్వరూ తీసుకురాలేదు నేనే తీసుకొచ్చాను అంటూ పారిజాతం చెప్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి..? మీరు మాట్లాడుతున్న మాటలేంటి అని దీప అడిగితే.. పారిజాతం కోపంగా దీపను తిడుతుంది. శివనారాయణ అడ్డు పడి జ్యోత్స్నకు పెళ్లి చేయడానికి నువ్వెవరు…? అందుకు దశరథ, సుమిత్రలు ఉన్నారు కదా అంటే పారిజాతం కోపంగా అలా అంటే ఇది అసలు శివనారాయణ మనవరాలు కానే కాదు అనబోతుంటే.. దాసు వస్తాడు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు నీ మాటలకు హద్దు లేదా..? అంటూ ఆపేస్తాడు. పారిజాతాన్ని అక్కడి నుంచి తీసుకెళ్తాడు దాసు.
బయటకు వెళ్లిన పారిజాతం దాసుతో నీ కూతురును నువ్వు తీసుకెళ్లు.. శివనారాయణ గారితో నిజం చెప్పు అంటుంది. దాసు షాక్ అవుతాడు. ఇంతకీ ఎవరు నా కూతురు అంటూ ఎదురు ప్రశ్నిస్తాడు. పెళ్లిమండపంలో మా అమ్మ శత్రువులు నాకు శత్రువులే అంటూ వారివైపు నిలబడింతో అప్పుడే వాళ్ల కూతురు అయిపోయింది. ఇక జ్యోత్స్న నా కూతురు కాదమ్మా..? ఇప్పుడు కూడా నిజం చెప్పాలనుకుంటే చెప్పు.. అప్పుడు కూడా జ్యోత్స్న నాతో వస్తానంటే తీసుకెళ్తాను.. లేదంటే తీసుకెళ్లను.. జ్యోత్స్న దాసు, కళ్యాణిల కూతురు కాదమ్మ.. దశరథ, సుమిత్రల కూతురు ఈ మాట శాశ్వతంగా ఉండిపోతుంది చూడు అంటూ చెప్పి వెళ్లిపోతాడు దాసు.
జ్యోత్స్న పని చేసే కేఫ్ ఓనరును తన దగ్గరకు పిలిపిస్తుంది మాలిని. ఆ కేఫ్ ఓనరుతో జ్యోత్స్న గురించి అడిగి వెంటనే జ్యోత్స్న తన మేన కోడలు అని శివనారాయణ గారి మనవరాలు అని చెప్పి జ్యోత్స్నను పనిలోంచి తీసేయమని చెప్తుంది. ఒకవేళ తీసేయకపోతే నీకున్న ఆ ఒక్క కేఫ్ కూడా లేకుండా పోతుందని వార్నింగ్ ఇస్తుంది మాలిని. ఆ ఓనరు సరే అంటూ వెళ్లిపోతాడు. కేఫ్ వెళ్లిన ఓనరు జ్యోత్స్నను పిలిచి తన దగ్గర పని చేయోద్దని నువ్వు ఎక్కడో ఉండాల్సిన దానివి అంటూ జాబ్‌లోంచి తీసేస్తున్నానని చెప్తాడు. జ్యోత్స్న ఏదైనా తప్పు చేశానా సార్ అని అడిగితే.. లేదమ్మా నేనే తప్పు చేశాను. నీ వివరాలు తెలుసుకోకుండా తప్పు చేశాను అంటూ ఓనరు చెప్పగానే.. మిమ్మల్ని నా విషయంలో ఎవరైనా బెదిరించారా..? అంటూ అడిగితే.. ఓనరు ఇంకేం చెప్పనని వెళ్లిపోమ్మని చెప్తాడు.. అప్పుడే సూరజ్ కేఫ్‌లోకి వస్తాడు. జ్యోత్స్న బయటకు వెళ్లిపోతుంటే.. కాఫీ ఆర్డర్ చేస్తాడు. జ్యోత్స్న పలకకుండా వెళ్లిపోతుంది.
దీప ఆఫీసులో తన క్యాబిన్‌లోకి వెళ్లిపోతుంటే.. రిసెప్షనిస్ట్ వచ్చి మీరు ఈ క్యాబిన్‌లోకి వెల్లకూడదట.. మిమ్మల్ని బయటే ఆ టేబుల్ దగ్గర కూర్చోమన్నారు అంటూ చెప్పగానే.. ఎవరు చెప్పారని దీప అడిగితే.. నేనే చెప్పాను అంటూ మాలిని వస్తుంది. బయట అయితే కూర్చోవా..? వెళ్లిపోతావా..? అంటే ఎక్కడైతే ఏంటి పని చేసుకోవడానికి అంటూ వెళ్లి కూర్చుంటుంది దీప. అప్పుడే బండెడు ఫైల్స్ దీప టేబుల్ మీదకు వస్తాయి. వాటిని సాయంత్రం వరకు చదివి సంతకం చేయాలి. ఏదైనా తేడా వస్తే ఆ నష్టం నువ్వే భరించాలి అంటూ మాలిని చెప్పగానే.. దీప షాక్ అవుతుంది. ఎవరిని ఎలా తరిమేయాలో నాకు తెలుసు దీప అంటూ వెళ్లిపోతుంది మాలిని.
కేఫ్ ముందు నిలబడిన జ్యోత్స్న దగ్గరకు వెళ్తాడు సూరజ్. నేను ఏడ్చుకుంటూ వెళ్లిపోయి ఉంటానని అనుకున్నావా..? అంటూ తిడుతుంటే.. సూరజ్ అర్థం కాక ముందు నువ్వు కేఫ్‌లో జాబ్ ఎందుకు మానేశావో చెప్పు అని అడిగితే.. బలే నటిస్తున్నావు.. నేను జాబ్ మానేయలేదు.. దండం పెట్టి మరీ వెళ్లిపోమ్మన్నారు ఇది కేవలం నీవల్లే అంటూ జ్యోత్స్న తిడుతుంది. వాళ్లకు ఏమని వార్నింగ్ ఇచ్చావు..? దొంగ సంతకాలతో నీ కేఫ్ లాగేసుకుంటానని బెదిరించావా..? అంటూ నిలదీస్తుంది. తన మీద పగతో తన చుట్టూ తిరుగుతూ తనను వేధిస్తున్నావని తిడుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.