E-Paper
Advertisement

Naga Vamshi: తారక్ అన్న జడ్జ్మెంట్ పై నమ్మకం… సాహసం చేసిన నాగ వంశీ!

Naga Vamshi: తారక్ అన్న జడ్జ్మెంట్ పై నమ్మకం… సాహసం చేసిన నాగ వంశీ!
Advertisement

Naga Vamsi:టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Ntr)ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ చిత్రం వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో  పాటు ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత నాగ వంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ పాత్ర పై క్లారిటీ..

Advertisement

ఇక త్వరలోనే నాగ వంశీ నిర్మాణంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన కింగ్ డం (King Dom)సినిమా జులై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో నాగ వంశీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే వార్ 2 గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర సుమారు 40 నిమిషాలు లేదా గంట పాటు ఉంటుందంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి. కానీ సినిమా మొదలైన 15 నిమిషాల నుంచి ఎన్టీఆర్ కనిపించబోతున్నారని తాజాగా నాగ వంశీ తెలియజేశారు.

కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి…

Advertisement

సినిమా మొదలైన 15 నిమిషాలకే తారక్ ఎంట్రీ కూడా ఉంటుందని సినిమా మొత్తం హృతిక్ రోషన్ తో సమానంగా ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నారని తెలిపారు. అలాగే వీరిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ కూడా ఉందని తెలిపారు. ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని, ఇలా ఈ సినిమాలో అన్ని ఉన్నాయని తెలుసుకున్నానని అయితే అవి ఎలా ఉంటాయో నేను కూడా ప్రేక్షకులతో పాటు ఈ సినిమా విడుదలైన తరువాతనే చూడాల్సి ఉంటుందని నాగ వంశీ తెలిపారు. అయితే ఈ సినిమాని భారీ ధరలకు కొనుగోలు చేయడానికి కారణం తారక్ అన్న జడ్జిమెంట్ అని నాగవంశీ తెలియజేశారు. తారక్ ఈ సినిమా గురించి ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత సినిమా మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతోనే కొనుగోలు చేశానని తెలిపారు.

తారక్ మాటపై నమ్మకం…

ఇక ఈ సినిమాని యశ్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచిన నేపథ్యంలోనే నాగ వంశీ 80 కోట్ల రూపాయలతో తెలుగు హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ జడ్జిమెంట్ పై నమ్మకంతో నాగ వంశీ పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. వార్ 2 విషయంలో ఎన్టీఆర్ జడ్జిమెంట్ ఎంతవరకు నిజమవుతుందనేది తెలియాలి అంటే ఆగస్టు 14వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఇక కింగ్ డం సినిమా విషయానికి వస్తే విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ జంటగా నటించిన ఈ సినిమా జూలై 31వ తేదీని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై కూడా ఎన్నో మంచి అంచనాలు ఉన్నాయి.

Also Read: Vijay Deverakonda Engagement:రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్… పెళ్లి కూతురు ఎవరంటే ?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×