Vijay Deverakonda Engagement: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగు పెట్టి హీరోగా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయిన ఈయన త్వరలోనే కింగ్ డం(King Dom) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జూలై 31వ తేదీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీగా ఉన్న నేపథ్యంలో విజయ్ దేవరకొండకు సంబంధించి ఓ వార్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
నిశ్చితార్థం..
విజయ్ దేవరకొండ అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని చెప్పాలి. త్వరలోనే ఈయన నిశ్చితార్థం(Engagment) చేసుకోబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే నిశ్చితార్థానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని, త్వరలోనే ఈయన నిశ్చితార్థం గురించి అధికారక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తోంది. ఇలా విజయ్ దేవరకొండ నిశ్చితార్థం గురించి వార్తలు రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా రష్మిక(Rashmika)తోనే నిశ్చితార్థం జరుపుకుంటున్నారా? లేదా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
రష్మిక తో రిలేషన్?
విజయ్ దేవరకొండ నిశ్చితార్థం ఎవరితో అనే విషయాల గురించి క్లారిటీ లేకపోయినా ఈయన నిశ్చితార్థం గురించి వార్తలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే రష్మిక, విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ డేటింగ్ రూమర్ల గురించి విజయ్ దేవరకొండ లేదా రష్మిక ఎక్కడ అధికారకంగా తెలియచేయలేదు కానీ వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు మాత్రం ఇన్ డైరెక్ట్ గా తెలియజేస్తూ వచ్చారు. అంతేకాకుండా ఇద్దరు కలిసి వెకేషన్ లకు వెళ్లినట్టు ఫోటోల ద్వారా చెప్పకనే చెప్పేశారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అందరూ భావించారు.
కింగ్ డం పైనే ఆశలు…
ఇక వీరి రిలేషన్ గురించి ఖచ్చితంగా అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు భావిస్తున్న తరుణంలో విజయ్ దేవరకొండ నిశ్చితార్థపు వార్తలు బయటకు వచ్చాయి. మరి విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అంటే అది రష్మికతోనేనా? మరెవరితోనైనా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ నిశ్చితార్థపు వార్తలలో కూడా ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే విజయ్ దేవరకొండ లేదా ఆయన టీం స్పందించాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈయన మాత్రం కెరియర్ పైనే పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేకపోవడంతో విజయ్ దేవరకొండ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈయన అభిమానులు కూడా కింగ్ డం సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. మరి జులై 31వ తేదీ రాబోయే ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: KritiSanon: ప్రియుడుతో సెల్ఫీలకు ఫోజులు ఇచ్చిన ప్రభాస్ బ్యూటీ… రూమర్స్ నిజమేనా?