Viral Video : ఏమరుపాటుగా ఉందని సింహంతో సెల్ఫీ దిగొద్దు.. ఇది సినిమా డైలాగే కానీ రియల్ లైఫ్‌లో ఓ బామ్మ అదే పని చేసింది. ఏకంగా సింహంతో సెల్ఫీ వీడియో తీసుకుంది. అంతేకాదు.. ఆ సింహానికి ఫుడ్ కూడా తినిపించింది. ఆ బామ్మ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏకంగా 3 కోట్ల మంది చూశారు. 7 లక్షల మందికి పైగా లైక్ చేశారు. వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం ట్రెండింద్‌లో ఉంది ఈ వీడియో.
బామ్మ చేతిని కొరికేసిన సింహం
ఆ వీడియోలో.. ముందరి పళ్లు ఊడిపోయి ఉన్న ఓ పండు ముసలావిడ మంచంపై కూర్చొని ఉంది. అదే మంచంపై ఓ సింహం కూడా ఉంది. బామ్మ పక్కన ఓ కంచంలో జంతువులకు పెట్టే ఆహారం ఉంది. ఒక చేత్తో సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. మరో చేత్తో కంచంలోని ఫుడ్‌ను ఆ సింహానికి తినిపిస్తోంది. ఆ సింహం చూట్టానికి భయంకరంగా ఉంది. ఆ బామ్మ చేతిని సరదాగా కొరికేసింది. ఆ బామ్మ వెంటనే తన చేతిని సింహం నోటి నుంచి లాగేసుకుంది. నవ్వుతూ వీడియో క్లోజ్ చేసింది. జస్ట్ 8 సెకన్ల ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఫుల్ వైరల్
హిందీలో మాట్లాడుతోంది ఆ బామ్మ. నా గేదె ఆహారం తినడం లేదు.. దీనికి జబ్బు చేసింది.. అంటూ ఆ పెద్దావిడ చెబుతోంది. అదేంటి? అక్కడ సింహం కనిపిస్తుంటే గేదె అంటుందేంటి? కొంపదీసి గేదె అనుకుని సింహానికి మేత పెడుతోందా ఏంటి? అంటూ నెటిజన్లు కంగారు పడుతున్నారు. అది పెంపుడు సింహం ఏమో అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా బామ్మ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Also Read : రైలు పట్టాలకు పెళ్లి.. వీడియో వైరల్
ఆ వీడియోలో ట్విస్ట్
అయితే, ఆ వీడియోలో ఓ ట్విస్ట్ ఉంది. అది నిజమైన సింహం కాదు. AI జనరేటెడ్ క్లిప్. ఏఐతో ఆ వీడియో క్రియేట్ చేశారు. బామ్మ నిజమే.. తిండి పెట్టడం నిజమే.. కానీ సింహమే అబద్దం. అట్లుంటది మరి AIతోని. ఎక్కడా చిన్న డౌట్ కూడా రాదు. ఎంత జూమ్ చేసి చూసినా.. చిన్న మిస్టేక్ కూడా కనిపించదు. అంత పర్‌ఫెక్ట్‌గా ఏఐతో వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలితే దుమ్ము రేపుతోంది. జనాల మైండ్ బ్లాక్ చేస్తోంది.