E-Paper
Advertisement

Naga Vamsi : వరుస డిజాస్టర్లు పడిన, మాటతీరు మారలే

Naga Vamsi : వరుస డిజాస్టర్లు పడిన, మాటతీరు మారలే
Advertisement

Naga Vamsi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తించేవారు నాగవంశీ. కేవలం ఆ బ్యానర్లో త్రివిక్రమ్ మాత్రమే దర్శకుడుగా సినిమాలు చేస్తారు. అయితే మిగతా దర్శకులతో పనిచేయాలి కాబట్టి సితార ఎంటర్టైన్మెంట్ సంస్థను నిర్మించారు. ఈ బ్యానర్ కు సంబంధించి కంప్లీట్ బాధ్యత అంతా కూడా నాగ వంశీ చూసుకుంటారు. అందుకే ఇండస్ట్రీలో కొంతమంది నాగవంశీ ను సితార వంశీ అని పిలుస్తూ ఉంటారు.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. జెర్సీ, సార్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమాలు ఆ బ్యానర్ కి మంచి గౌరవాన్ని తీసుకొచ్చాయి. జెర్సీ సినిమా అయితే ఏకంగా నేషనల్ అవార్డు తీసుకొచ్చింది. అయితే అన్నిసార్లు అన్ని సినిమాలు వర్క్ అవుట్ అవ్వవు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2025 సంవత్సరంలో సీతారా ఎంటర్టైన్మెంట్ సంస్థకి సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు.

వరుస డిజాస్టర్లు

Advertisement

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి సంక్రాంతికి విడుదలైన సినిమా డాకు మహారాజ్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ సినిమా పాజిటివ్ టాక్ సాధించుకుంది కానీ కొన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ కూడా కానీ పరిస్థితి. ఆ తర్వాత వచ్చిన మ్యాడ్ స్క్వేర్ కొంతవరకు పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ బ్యానర్ లో ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా కింగ్డమ్.

గౌతమ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా మీద విపరీతమైన హైప్ క్రియేట్ చేశాడు నాగ వంశీ. కానీ సినిమా దానిని అందుకోలేకపోయింది. ఈ సినిమా చెడ్డ సినిమా కాకపోయినా కూడా అంచనాలు అందుకోలేదు కాబట్టి సినిమాకి కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు.

Advertisement

ఎన్టీఆర్ నటించిన వార్ సినిమా డిస్ట్రిబ్యూషన్ తెలుగు రాష్ట్రాల్లో చేశారు నాగ వంశీ. అయితే ఆ సినిమా ఈవెంట్లో నాగవంశీ మాట్లాడుతూ ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఇంకెప్పుడూ మైక్ పట్టుకొని నా సినిమా చూడండి అని అడగను అని శపధం చేశాడు. ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయింది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మాస్ జాతర సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

మాట తీరు మారలేదు 

అయితే ఇన్ని సినిమాలు వరుసగా ఫెయిల్ అయిన కూడా వంశీ లోని మాట తీరు మారలేదు అనేది కొంతమంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్న టాపిక్. వంశీ ప్రస్తుతం ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య నటించిన ఎపిక్ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా గ్లిమ్స్ వీడియో నేడు విడుదలైంది. వీడియో సినిమా మీద మంచి ఆసక్తిని పెంచుతుంది. అయితే ఈ సినిమా ఈవెంట్లో నాగవంశీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఐ బొమ్మ రవి గురించి ప్రస్తావిస్తూ తనని రాబిన్ హుడ్ లా సోషల్ మీడియాలో చూస్తున్నారు. మేము కేవలం 50 రూపాయలు సినిమా టిక్కెట్ రేటు పెంచుకుంటే అది తప్పు అయిపోయింది.

అంతేకాకుండా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలలో నాదే చిన్న సినిమా నామీద జాలితో ఎవరైనా చూస్తారా అని సింపతి కార్డు వాడుతున్నాను అంటూ వెటకారంగా మాట్లాడారు వంశీ. అయితే ప్రస్తుతం ఎపిక్ సినిమా ఈవెంట్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : JETLEE : కమెడియన్ సత్య సినిమా కోసం ఏకంగా వారణాసి సినిమాను వాడుకుంటున్నారు

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×