BigTV English

Niharika Divorce: నిహారిక విడాకుల తప్పు నాదే.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన నాగబాబు

Niharika Divorce: నిహారిక విడాకుల తప్పు నాదే.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన నాగబాబు

Niharika Divorce: నిహారిక కొణిదెల (Niharika Konidela)పరిచయం అవసరం లేని పేరు. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టిన నిహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్, నటిగా దూసుకుపోతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)వారసురాలిగా నిహారిక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణం వదిలిపెట్టిన నిహారిక అనంతరం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చారు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి హీరోయిన్గా నిహారిక గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ మెగా అభిమానులు మాత్రం ఈమెను హీరోయిన్గా చూడటానికి ఇష్టపడలేదని చెప్పాలి.


పెద్దలు కుదిర్చిన వివాహం…

ఒకరకంగా నిహారిక వెండితెరపై సక్సెస్ కాలేదు అంటే మెగా అభిమానులే కారణమని కూడా చెప్పాలి. ఇలా మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా నిహారిక రావడానికి కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తద్వారా తనకు సరైన హిట్ మాత్రం అందించలేకపోయారు. ఇలా మూడు సినిమాలలో హీరోయిన్ గా నటించిన నిహారిక సక్సెస్ అందుకోకపోవడంతో పెద్దలు చూసిన అబ్బాయి జొన్నలగడ్డ వెంకట చైతన్యతో(Jonnalagadda Venkata Chaitanya) ఏడడుగులు వేశారు. ఈమె వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి జరిగిన రెండు సంవత్సరాల వ్యవధిలోని నిహారిక వెంకట చైతన్య విడాకులు(Divorce) తీసుకొని విడిపోయారు.


కూతురి విషయంలో తప్పు చేశా…

నిహారిక వెంకటచైతన్య విడాకులు తీసుకుని విడిపోవడానికి సరైన కారణమేంటి అనేది తెలియదు కానీ వీరి విడాకుల గురించి మాత్రం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. అయితే నిహారిక కూడా తన విడాకుల గురించి వస్తున్న రూమర్లపై గతంలో స్పందిస్తూ… ఎవరు విడిపోవాలని పెళ్లిళ్లు చేసుకోరు, కొన్ని కారణాలవల్ల విడిపోవాల్సి వస్తుందని ఘాటుగా రిప్లై ఇచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా నిహారిక విడాకుల గురించి స్పందిస్తూ నిహారిక విషయంలో నేనే తప్పు చేశానని ఇన్నాళ్లకు ఓపెన్ అయ్యారు.

మా జడ్జిమెంట్ తప్పయింది..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబు పిల్లల గురించి మాట్లాడుతూ వరుణ్ (Varun) లావణ్య (Lavanya)పెళ్లి కాకముందు వీరిద్దరి గురించి నాకు బయట వాళ్ళు చెబితే వార్తలు తెలిసాయి. ఇదే విషయం తనని అడిగితే అవుననే చెప్పారు నువ్వు తనతో సంతోషంగా ఉంటావా అని అడిగాను అవునన్నారు వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాను. లావణ్య విషయంలో వరుణ్ జడ్జిమెంట్ కరెక్ట్ కానీ, నిహారిక విషయంలో నేను తప్పు చేశాను, తన విషయంలో మా జడ్జిమెంట్ కరెక్ట్ కాలేదని నాగబాబు తెలిపారు. నిహారికకు మేమే అబ్బాయిని చూసి పెళ్లి చేశాము,నిహారిక కూడా తనని ఇష్టపడే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వారిద్దరికీ సెట్ అవ్వలేదు అందుకే విడిపోతున్నామని చెప్పగానే నేను అడ్డు చెప్పలేదని, అలాగే కలిపే ప్రయత్నాలు కూడా చేయలేదని తెలిపారు. ఇద్దరు చాలా గౌరవంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇప్పుడు కెరియర్ పరంగా నిహారిక నిర్మాతగా మారి ఎంతో సక్సెస్ అందుకొని బిజీగా ఉన్నారని నాగబాబు తెలిపారు. ఇక మీడియాలో నిహారిక విడాకుల గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అవేవీ నిజం కాదని వాళ్ళిద్దరూ మంచి అభిప్రాయంతోనే విడిపోయారు అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: ట్వింకిల్ టోట్స్ ప్రీ ప్రైమరీ స్కూల్‌ ప్రారంభించిన సుమ.. వారి కల నెరవేరనుందా?

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×