Best Hair Care Tips: జుట్టు రాలే సమస్యను ప్రస్తుతం చాలా మంది ఎదుర్కుంటున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. వంటగదిలో ఉండే పెరుగు మీకు చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు మీ జుట్టును మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా జుట్టుకు అవసరం అయిన బలాన్ని అందిస్తాయి. చుండ్రు సమస్యలు ఉన్న వారికి కూడా పెరుగు సహాయపడుతుంది. పెరుగు జుట్టు సంరక్షణకు అమృతం లాంటిది. ఇందులో ఉండే విటమిన్-సి, సిట్రిక్ యాసిడ్, ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు మూలాలను బలోపేతం చేయడంతో పాటు మృదువుగా చేస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పెరుగును జుట్టుకు ఉపయోగించే సరైన విధానంతో పాటు ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చుండ్రును వదిలించుకోండి:
పెరుగులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తలలోని మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ తలని లోతుగా శుభ్ర పరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా చుండ్రు తగ్గి జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.
పొడి జుట్టుకు ఒక వరం:
జుట్టు నిస్తేజంగా, పొడిగా మారితే.. పెరుగు దానికి సహజ కండిషనింగ్ పనిచేస్తుంది. పెరుగు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టును హైడ్రేట్‌గా ఉంచుతుంది. మృదువుగా, సిల్కీగా తయారు చేస్తుంది.
జుట్టు రాలడం తగ్గుతుంది:
పెరుగులో ఉండే బయోటిన్, జింక్ జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తాయి. ఇదే కాకుండా.. తలపై ఎలాంటి బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ పెరగడానికి అనుమతించదు. ఫలితంగా జుట్టు పెరుగుదలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: టమాటో ఫేస్ ప్యాక్‌తో.. 10 నిమిషాల్లోనే నిగనిగలాడే చర్మం
చర్మ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం:
పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా తలపై చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇది దురద లేదా చికాకు వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. చుండ్రు వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు పెరుగు తరచుగా వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఎలా ఉపయోగించాలి ?
పెరుగును బాగా గిలకొట్టి జుట్టు, తలకు అప్లై చేయండి. షాంపూ వాడటానికి రెండు గంటల ముందు దీనిని ఉపయోగించండి. వారానికి ఒకసారి పెరుగు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఈ విధంగా.. పెరుగు జుట్టు అందాన్ని పెంచడంలో సహాయ పడుతుంది. రసాయన ఉత్పత్తులు వాడకుండా పెరుగు తలకు తరచుగా అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
పెరుగులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు (B2, B12, A), పొటాషియం, మెగ్నీషియం ,ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి తలపై ఉండే చర్మానికి అవసరం అయిన పోషకాలను అందిస్తాయి. ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. వీటిలోని పోషకాలు జుట్టు రాలకుండా నివారిస్తాయి. అంతే కాకుండా చుండ్రు సంబంధిత సమస్యలను కూడా నివారిస్తాయి.