BigTV English

Nithish Kumar Reddy : SRH నుంచి ఔట్.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా ఆటగాడు..!

Nithish Kumar Reddy : SRH నుంచి ఔట్.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా ఆటగాడు..!

Nithish Kumar Reddy :  టీమిండియా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడుతున్న విషయం తెలిసిందే. 2024లో అయితే అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి జోడీ అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. మరోవైపు నితీశ్ కుమార్ బౌలింగ్ కూడా చేయడంతో ఆల్ రౌండర్ గా మారాడు. అయితే నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం గాయం కారణంగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ కి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే..? వచ్చే ఐపీఎల్ సీజన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున నితీశ్ కుమార్ రెడ్డి ఆడడు అని రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026లో వేరే జట్టు తరపున ఆడేందుకు తాను సన్ రైజర్స్ హైదరాబాద్ ను విడిచిపెట్టినట్టు వస్తున్నటువంటి రూమర్స్ పై క్రికెట్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్పందించాడు.


Also Read :  Ravinda Jadeja : ఓటమి నుంచి డ్రా వరకు.. టెస్టుల్లో జడేజా అరుదైన రికార్డు

నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని.. 


తాను ఎల్లప్పుడూ తన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ కి అండగా నిలుస్తానని.. వారి తరపున ఆడుతూనే ఉంటానని క్లారిటీ ఇఛ్చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడి వేరే టీమ్‌కి వెళ్లిపోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా నితీష్ రెడ్డి గురించి వార్తలు వస్తున్నాయి. ఇటీవలె మోకాలి గాయంతో ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టులకు దూరం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌తో విభేదాలతోనే జట్టును వీడుతున్నాడంటూ పుకార్లు వచ్చాయి. టీమ్‌లో తన పాత్ర పట్ల అసంతృప్తిగా ఉన్నాడని, ముఖ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలని అనుకుంటున్నాడని, అందుకే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఒప్పుకోవడం లేదని నితీష్‌ అన్‌ హ్యపీగా ఉన్నాడని పుకార్లు వచ్చాయి. అందుకే జట్టును వీడుతున్నాడనే ప్రచారం జరిగింది.

SRH లోనే అంటూ క్లారిటీ.. 

దీనిపై స్పందించిన నితీష్‌ తన అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేస్తూ.. “నేను అనవసరపు విషయాలకు దూరంగా ఉంటాను. కానీ కొన్ని విషయాలకు స్పష్టత అవసరం. SRH తో నా సంబంధం నమ్మకం, గౌరవం, సంవత్సరాల ఉమ్మడి అభిరుచిపై నిర్మించబడింది. నేను ఎల్లప్పుడూ ఈ జట్టుకు అండగా నిలుస్తాను.” అని పేర్కొన్నాడు. ఈ స్టేట్‌మెంట్‌తో నితీష్‌ కుమార్‌రెడ్డి ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడి పోవడం లేదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. కాగా IPL 2025 లో నితీష్ రెడ్డి అంత గొప్పగా రాణించలేదు. అతను బ్యాట్, బాల్‌తో ఇబ్బంది పడ్డాడు, 13 ఇన్నింగ్స్‌లలో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. 2023 లో ఫ్రాంచైజీతో తన IPL అరంగేట్రం చేసిన నితీష్‌ IPL 2024 లో అతని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 303 పరుగులు చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. 2025లో అతనిపై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ వాటిని అందుకోలేకపోయాడు. టీమిండియా లో కీలకంగా రాణిస్తున్నాడనుకున్న తరుణంలోనే నితీశ్ గాయాల పాలయ్యాడు. ముందు ముందు అయిాన టీమిండియా తరపున పుంజుకొని కీలక ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×