E-Paper
Advertisement

వైభవ్ వయస్సు కంటే, ఎక్కువ రన్స్ చేయడం లేదు.. పరువు తీసిన మాజీ క్రికెటర్

వైభవ్ వయస్సు కంటే, ఎక్కువ రన్స్ చేయడం లేదు.. పరువు తీసిన మాజీ క్రికెటర్
Advertisement

Akash Chopra On Vaibhav:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను పక్కకు పెట్టి మరి వైభవ్ సూర్య వంశీకి అవకాశం ఇచ్చారు. వరుసగా మూడు మ్యాచ్ లలో వైభవ్ ఆడితే… ఒక్క మ్యాచ్ లో కూడా 20 పరుగులు దాటలేదు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని పక్కకు పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ లో తప్ప వీడికి అంతర్జాతీయ క్రికెట్లో ఆడడం చేతకాదంటూ హేళన చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ఐపీఎల్ లో ఆడినట్లుగా… అంతర్జాతీయ క్రికెటర్ లో ఆడడం లేదని చురకలు అంటించారు. కనీసం వాడి వయసు అంతైనా పరుగులు చేయడం లేదని విమర్శలు చేశారు. 15 ఏళ్ల కుర్రాడు 15 పరుగులు కూడా చేయలేకపోతే అంతర్జాతీయ క్రికెట్ లో ఆడడం ఎందుకు అంటూ నిలదీశారు.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

వైభవ్ సూర్య వంశీ పై రెచ్చిపోయిన ఆకాష్ చోప్రా

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వరుసగా విఫలమవుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో సెంచరీల మీద సెంచరీలు చేసిన ఈ కుర్రాడు.. ఇంగ్లాండ్ గడ్డపై మాత్రం చతికల పడుతున్నారు. ఒక మ్యాచ్లో కూడా 20 పరుగులు దాటలేదు వైభవ్. ఈ నేపథ్యంలోనే ఆకాష్ చోప్రా ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ అంటే ఐపిఎల్ అనుకుంటున్నాడని.. అందుకే ప్రతి బంతి సిక్సర్ లేదా బౌండరీ కోసం ప్రయత్నిస్తున్నాడని విమర్శలు చేశారు. ప్రతి బంతి సిక్సర్ కొట్టాలంటే కష్టమేనని.. అలా ఆడితే విదేశీ గడ్డలపై అస్సలు నడవదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే వైభవ్ సూర్య వంశీ ఆడితే… టీమిండియా నుంచి బయటకు పంపించడం గ్యారంటీ అని సీరియస్ అయ్యారు. అనవసరంగా వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ను ఈ బుడ్డోడి కోసం పక్కకు పెట్టారని మండిపడ్డారు. అసలు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు బుర్రలేదని… అనవసరంగా టీమిండియాలో మార్పులు చేసి ఓటమికి నాంది పలుకుతున్నాడని ఫైర్ అయ్యారు. తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ లాంటి ఆటగాళ్లు జట్టులో ఎందుకు ఉంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదని విమర్శలు చేశారు.

మూడు మ్యాచ్ లలో వైభవ్ ఎన్ని పరుగులు చేశాడంటే ?

15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ పైన వరుసగా మూడు మ్యాచ్ లలో ఆడాడు. మొదటి మ్యాచ్ లో 14 పరుగులు చేసిన వైభవ్ సూర్య వంశీ, రెండో మ్యాచ్ లో 13 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఇక నాలుగో టి 20 లో పది బంతులలో 15 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. అంటే ఓవరాల్ గా మనోడు 50 పరుగులు కూడా చేయలేదు. అందుకే తీవ్రస్థాయిలో వైభవ్ను విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

Related News

Video: ఆర్చ‌ర్ బౌలింగ్ లో ఆడ‌టం చేత‌కావ‌డం లేదా? వైభ‌వ్ కు క్లాస్ పీకిన‌ గంభీర్

వ‌రుస ఓట‌ములు, గంభీర్ ను దించేందుకు బీసీసీఐ కిరాక్ ప్లాన్‌..ఆ రాక్ష‌సుడే వ‌స్తున్నాడు ?

ఇంగ్లాండ్ చేతిలో ఓట‌మి, ఒలింపిక్స్ నుంచి టీమిండియా ఔట్? రంగంలోకి పాకిస్తాన్‌

టీమిండియాను చూస్తే జాలేస్తోంది..సిక్స‌ర్లు కాదు సింగిల్ తీయ‌డానికి కూడా ముప్ప‌తిప్ప‌లు ప‌డుతున్నారు

ఈ ఇద్ద‌రు బీహారీలే టీమిండియాను నాశ‌నం చేస్తున్నారు

గెలుపు కోసం ఇంగ్లాండ్ ముందు టీమిండియా బిక్షాట‌న చేస్తోంది !

వైభ‌వ్ కు క‌ళ్లు నెత్తికి ఎక్కాయ్…వీడు టీమిండియాకు ప‌నికిరాడు!

Big Stories

Advertisement
×