Psychological Horror: ఇటీవల కాలంలో ఆడియన్స్ మోస్ట్ వయోలెంట్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మీకు కూడా అలాంటి సినిమాలే ఇష్టం అయితే ఈ మూవీ మీ కోసమే. రక్తంతో తడిసిన వెడ్డింగ్ డ్రెస్ లో హీరోయిన్ చేతులు వణుకుతుండగా, ఆ కాళరాత్రి నుంచి తప్పించుకున్నాను అనుకుంటుంది. కానీ కథ అక్కడే మొదలవుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీతో రూపొందిన మూవీ పేరే ‘రెడీ ఆర్ నాట్ 2 : హియర్ ఐ కమ్’ (Ready or Not 2 : Here I Come). మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్న వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం ‘రెడీ ఆర్ నాట్’లో లే డోమాస్ కుటుంబం ‘హైడ్ అండ్ సీక్’ ఆట నుంచి గ్రేస్ ప్రాణాలతో బయటపడింది. ఇంతటి భయాంకరమైన సిట్యుయేషన్స్ నుంచి బయట పడ్డ హీరోయిన్ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటుంది. కానీ ఆమె బ్లడీ బ్లడ్ బాత్ నుంచి బయట పడిన క్షణం నుంచే, ఆట నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందని గ్రహిస్తుంది. ఇది కేవలం మొదటి రౌండ్ మాత్రమే… నెక్స్ట్ రౌండ్ కి ఇప్పుడు ఆట రూల్స్ మారాయి. ఈసారి శత్రువులు ఇంకా బలవంతులు. ఇక్కడ నుంచి కథలో ఊహించని మలుపు తిరుగుతుంది.
అయితే ఈసారి గ్రేస్ ఈ గేమ్ లో ఒంటరి ఉండదు. చాలా కాలం నుంచి దూరంగా ఉండే ఆమె సోదరి ఫెయిత్ కూడా ఈ భయంకరమైన ఆచారంలో చిక్కుకుంటుంది. ఇద్దరు సిస్టర్స్ మధ్య ఉన్న పాస్ట్ కథకు మరింత ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఫెయిత్‌ను కాపాడుకోవడం గ్రేస్‌కి ఉన్న అదనపు బాధ్యత కాదు, అది ఆమె జీవితంలోని అతి పెద్ద ఛాలెంజ్ అవుతుంది.
ఈ సారి గ్రేస్ ఒంటరిగా లేదు. ఆమెకు చాలా కాలం నుంచి దూరమైన సోదరి ఫెయిత్ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుపోతుంది. ఇద్దరు సిస్టర్స్ ఈ ప్రమాదం నుంచి బయట పడాల్సి ఉంటుంది. మొదటి భాగంలో ఒక్క కుటుంబం మాత్రమే ఉంటే, సెకండ్ పార్ట్ లో ప్రపంచాన్ని సీక్రెట్ గా నడిపే హై కౌన్సిల్ అనే రహస్య సంస్థకు చెందిన నాలుగు శక్తివంతమైన ఎలైట్ కుటుంబాలు గ్రేస్, ఫెయిత్‌లను వేటాడతాయి.
బాగా డబ్బున్న ఈ కుటుంబాలు ప్రపంచాన్ని శాసించే సింహాసనం కోసం ఈ భయంకరమైన గేమ్ ఆడతారు. ఎవరు ఈ ఆటలో గెలుస్తారో వాళ్ళ చేతుల్లోనే అంతా ఉంటుంది. కథ పూర్తిగా ఒకేరోజు రాత్రి సమయంలోనే సాగుతుంది. తెల్లవారేలోపు గ్రేస్ తన సోదరిని రక్షించుకుంటూ బతకాలి. ఈ క్రమంలో ట్విస్టులతో పిచ్చెక్కించే చేజ్ సీక్వెన్స్‌లు, ఊహించని ట్రాప్స్, చావులు, సీట్-ఎడ్జ్ ట్విస్టులు వస్తూ ఉంటాయి. మరి చివరికి ఆ అక్కాచెల్లెళ్లు ఈ ట్రాప్ నుంచి తప్పించుకున్నారా ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? చివరికి ఆ సింహాసనం ఎవరికి దక్కింది ? అన్నది స్టోరీ.
ఈ సినిమా జూలై 16 అంటే ఈరోజు నుంచే JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియోతోనే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు కాబట్టి ఇంగ్లీష్ కంఫర్టబుల్ ఉన్నవాళ్లు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వొద్దు. అంతకంటే ముందు మొదటి భాగం చూస్తే బెటర్.
Read Also: అపార్ట్మెంట్లో ఉండే ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సిరీస్… యూనిక్ కొరియన్ క్రైమ్ కామెడీ డ్రామా