BigTV English

Nagarjuna: శ్రీదేవిని అవమానించిన నాగార్జున… విడిచి పెట్టేదే లేదంటున్న ఫ్యాన్స్

Nagarjuna: శ్రీదేవిని అవమానించిన నాగార్జున… విడిచి పెట్టేదే లేదంటున్న ఫ్యాన్స్

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున(Nagarjuna) ఇటీవల శేఖర్ కమ్ముల (Sekhar Kammula)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కుబేర సినిమా(Kuberaa) ద్వారా మరో హిట్ అందుకున్నారు. ఇటీవల కాలంలో నాగార్జున సోలో హీరోగా కంటే కూడా ఇలా హీరోల సినిమాలలో క్యామియో పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ధనుష్, రష్మిక(Rashmika) హీరో హీరోయిన్లుగా నటించిన కుబేర సినిమాలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.


శ్రీదేవితో పోలిక ఏంటీ…

తెలుగు తమిళ భాషలలో ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ రష్మిక గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. రష్మిక నటన చాలా అద్భుతంగా ఉంటుందని, ఈ సినిమాలో తన పాత్ర కోసం రష్మిక ప్రాణం పెట్టి నటించింది అంటూ రష్మిక నటనపై ప్రశంసలు కురిపించారు. ఇంతవరకు బానే ఉన్నప్పటికీ నాగార్జున రష్మిక గురించి ఇంకా మాట్లాడుతూ ఈ సినిమాలో తన నటన చూస్తుంటే నాకు క్షణం క్షణం సినిమాలో శ్రీదేవి(Sridevi) గుర్తుకు వచ్చిందని అంత అద్భుతంగా రష్మిక నటించిందని తెలిపారు.


శ్రీదేవికి ఎవరు సాటిరారు…

ఇలా రష్మికను ఏకంగా శ్రీదేవితో పోల్చి మాట్లాడటంతో రష్మిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం నాగార్జున వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియో పై శ్రీదేవి అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి ఎంతో గొప్ప నటి, శ్రీదేవి లాంటి గొప్ప నటితో రష్మికను పోల్చడం ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి నటనపరంగా ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు. నటనపరంగా, అందం పరంగా శ్రీదేవికి ఎవరు సాటిరారు. అలాంటిది రష్మికను శ్రీదేవితో పోలుస్తూ శ్రీదేవిని నాగార్జున అవమానించారు అంటూ నాగార్జున తీరుపై తీర్థ స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఆఖరిపోరాటం..

సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని అలాంటి గొప్ప నటితో ఇతరులను పోల్చడం సరికాదని తెలియజేస్తున్నారు. ఇకపోతే శ్రీదేవి నాగార్జున కాంబినేషన్లో “ఆఖరిపోరాటం” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా శ్రీదేవి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి మొదలుకొని చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో కూడా నటించి సక్సెస్ అందుకున్నారు. ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, బాలీవుడ్, కన్నడ, బోజ్ పురి వంటి భాషలలో కూడా సినిమాలు చేస్తూ నటిగా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే శ్రీదేవి అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పాలి. ఇప్పటికి కూడా ఈమె మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక శ్రీదేవి మరణాంతరం ఈమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసింది.
Also Read: థగ్ లైఫ్ ఎఫెక్ట్… క్షమాపణలు చెప్పిన మణిరత్నం! 

Related News

Kannada Actor : కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. భార్య చీపురుతో కొట్టిందని నటుడు ఆత్మహత్య..

Chinmayi Sripada : రిపోర్టర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిన్మయి.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

Nagarjuna:టబు, రమ్యకృష్ణ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్.. నాగ్‌ను ఇరకాటంలో పెట్టిన జగపతిబాబు

NTR: నా తొలి అభిమాని అతడే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Kangana Ranaut: క్యాస్టింగ్ కౌచ్ పై కంగనా కామెంట్స్.. అలా చేస్తేనే అవకాశం!

Betting Apps case: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో రానా..

Big Stories

×