Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన 100 చిత్రంలో నటిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అత్యంత భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమాలో నాగార్జున డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడని గత కొద్ది రోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉంది. ఈ మూవీతో టాలీవుడ్ కి కార్తీక్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసుకుని థియేటర్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.. ఇదిలా ఉండదా ఈనెల 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారని ఫిలిం ఇండస్ట్రీలో టాక్.. మరి ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాబోతుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.
తెలుగు ఇండస్ట్రీలో హీరోల బర్త్డేల సందర్భంగా ఆ సినిమాల నుంచి అప్డేట్స్ రావడం కామన్.. తమ సినిమాలో నటిస్తున్న హీరోలకి బర్త్ డే విషెస్ చెబుతూ.. చిత్ర యూనిట్ రిలీజ్ చేసే పోస్టర్లు లేదా గ్లింప్స్ వీడియోలు జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. అదేవిధంగా ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు రాబోతుంది. ఈ సందర్భంగా నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం నుంచి అప్డేట్ రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ నుంచి టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లింప్స్ లోనే టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించనున్నారట.. ఇటీవల చిరంజీవి, వెంకటేష్ అలాగే బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. నెక్స్ట్ ఆ లిస్టులోకి నాగార్జున చేరుతాడా లేదా అన్నది ఇప్పుడు కాస్త సస్పెన్స్ కానీ మారింది.
అక్కినేని నాగార్జున తన సినిమాలలో కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ తో పాటుగా, స్టోరీ కూడా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు రాబోతున్న ఈ 100 వ సినిమాలో కూడా ఆయన డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం. ఇకపోతే గతంలో నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే వంటి క్లాసిక్స్ తర్వాత మళ్లీ నాగార్జున, టబు కాంబినేషన్ కుదరడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.. మరి ఈ మూవీతో నాగర్జున 100 కోట్ల క్లబ్ లోకి చేరతాడు లేదా అన్నది ఆయన బర్త్డేకి రాబోతున్న గ్లింప్స్ వీడియో నిర్ణయిస్తుంది. నాగార్జున ఫ్యాన్స్ ఆ వీడియోను ఎప్పుడెప్పుడు చూస్తామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి డైరెక్టర్ కార్తీక్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ని క్రియేట్ చేస్తాడు చూడాలి.. ఇకపోతే నాగార్జున సినిమాలు తో పాటుగా త్వరలోనే ప్రారంభం కాబోతున్న బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ లో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాని ఆ లోపల పూర్తి చేయాలని అనుకున్నాడు కానీ అది పూర్తవలేదు. ఈ ఏడాది డిసెంబర్లో ఆయన సినిమా రిలీజ్ కాబోతుందని టాక్..
Also Read :యంగ్ హీరో సూసైడ్.. హీరోయిన్ చనిపోతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..