E-Paper
Advertisement

బుల్లితెరపై లెనిన్ సినిమా ఎప్పుడంటే?

బుల్లితెరపై లెనిన్ సినిమా ఎప్పుడంటే?
Advertisement

Lenin Movie: అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ (Akhil Akkineni) ఎన్నో ఏళ్లుగా బ్లాక్ బస్టర్ విజయం కోసం ఆరాటపడిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆయన ఎదురుచూపుకు తెరపడింది. లెనిన్ (Lenin) రూపంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishore abburu) దర్శకత్వంలో అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే(Bhagya shri Borse) హీరోయిన్గా నటించిన ఈ చిత్రం జూలై 10వ తేదీన విడుదలై అఖిల్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జీ ఫైవ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ వెర్షన్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

టీవీల్లోకి లెనిన్ వచ్చేది ఎప్పుడంటే..?

ఇకపోతే థియేటర్లలో, ఓటీటీలలో సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే మరి టీవీ ప్రియుల కోసం ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు అంటూ టీవీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడగా వారికి గుడ్ న్యూస్ చెబుతూ చిత్ర బృందం మరో ఆసక్తికర వార్త బయట పెట్టింది. లెనిన్ సినిమాను మరింత ఎక్కువ మంది వీక్షించేలా ఈ సినిమాను బుల్లితెరపై ప్రీమియర్ చేయడానికి ప్రముఖ టీవీ ఛానల్ సిద్ధమయ్యింది. ఆగస్టు 30వ తేదీన ఆదివారం సాయంత్రం 5:30గంటలకు జీ తెలుగు ఛానల్ లో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ ప్రీమియర్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే థియేటర్లలో సందడి చేస్తూ ఓటీటీలలో విపరీతంగా పాపులారిటీ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.

Advertisement

also read: ఇరుముడి’తో సంచలనం సృష్టించిన బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జియో హాట్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్..

ఇదిలా ఉండగా మరొకవైపు ప్రేక్షకులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. లెనిన్ సినిమాను మరింత మంది వీక్షించే విధంగా మరో ఓటిటి ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ లో కూడా హిందీ వర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలలో కూడా మంచి రికార్డులు క్రియేట్ చేస్తోంది. అయితే ఇప్పుడు జియో హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపోతే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ తోపాటు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు . రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో సునీల్ , శివాజీ కీలకపాత్రలు పోషించగా.. ఈశ్వరీ రావు, బ్రహ్మాజీ, ప్రమోద్ పంజు తదితరులు కీలకపాత్రలు పోషించారు . ఎస్ తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.

Related News

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Big Stories

Advertisement
×