E-Paper
Advertisement

షాప్ ఓపెనింగ్‌లో రోబో తీన్మార్ డ్యాన్స్.. స్టెప్పులు చూసి జనం ఫిదా!

షాప్ ఓపెనింగ్‌లో రోబో తీన్మార్ డ్యాన్స్.. స్టెప్పులు చూసి జనం ఫిదా!
Advertisement

Viral Robot Dances Video: ఒకప్పుడు ప్రయోగశాలలకే పరిమితమైన రోబోలు ఇప్పుడు నిజజీవితంలోకి అడుగు పెట్టాయి. జనాలకు పని తగ్గించేదుకు అవి పని చేస్తున్నాయి. హోటళ్లలో చెఫ్ పాత్రల నుంచి వెయిటర్ల వరకు అద్భుతంగా శ్రమిస్తున్నాయి. అన్ని రంగాల్లోకి అడుగు పెడుతున్నాయి. ఇక హ్యూమనాయిడ్ రోబోలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. మనుషులు చేసే పనులతో పాటు మనుషులు చేయలేని పనులను కూడా చేస్తున్నాయి. తాజాగా ఓ హ్యూమనాయిడ్ రోబో ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తీన్మార్ స్టెప్పులు వేసిన రోబో  

మధ్యప్రదేశ్  నానఖేడ బస్ స్టాండ్ సమీపంలో జరిగిన ఓ కొత్త శాండ్‌విచ్ అవుట్‌లెట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అవుట్‌లెట్ ప్రారంభానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అయితే, అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది ఓ స్పెషల్ గెస్ట్. అదే మనిషిలా కనిపించే హ్యూమనాయిడ్ రోబో. దాని డ్యాన్స్ చూసి అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు.  సాధారణంగా షాప్ ఓపెనింగ్ అంటే రిబ్బన్ కటింగ్, అతిథుల సందడి, ప్రజల రద్దీ కనిపిస్తుంటుంది. కానీ, ఈ ప్రారంభోత్సవంలో మాత్రం ఈ రోబో చేసిన సందడి వావ్ అనిపించింది. డప్పు దరువులకు తగ్గట్లుగా డ్యాన్స్ చేసి అలరించింది. రోబో డ్యాన్స్‌ చూసేందుకు చుట్టుపక్కల వారంతా గుమిగూడారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేయగా, మరికొందరు రోబో తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.  ముఖ్యంగా పిల్లలు, యువత రోబో ను చూసి సరదాగా గడిపారు.

Advertisement

కొత్త టెక్నాలజీని ఇలాంటి వేడుకల్లో వినోదంగా ఉపయోగించడం అందరినీ ఆకట్టుకుంది. టెక్నాలజీ రోజురోజుకు మనుషుల జీవితాల్లో భాగమవుతున్న నేపథ్యంలో, ఇలాంటి రోబోట్లు వినోద కార్యక్రమాల్లో కూడా కనిపించడం కొత్త అనుభూతిని ఇస్తోంది. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన రోబోలు ఇప్పుడు షాపింగ్ మాల్స్, ఈవెంట్లు, ప్రచార కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో కూడా సందడి చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో వీడియో వైరల్‌

రోబో తీన్మార్ స్టెప్పులు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన వారికి ఓ క్రేజీ ఎంటర్ టైన్ మెంట్ లభించింది. కొత్త అవుట్‌ లెట్ ప్రారంభానికి వచ్చిన ప్రజలు రోబో  డ్యాన్స్‌ ను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. మొత్తానికి ఏవీ మధురం శాండ్‌ విచ్ కొత్త అవుట్‌ లెట్ ప్రారంభోత్సవంలో రోబో చేసిన డ్యాన్స్ అందరినీ ఆకర్షించింది. తీన్మార్ స్టెప్పులతో సందడి చేసిన ఈ హ్యూమనాయిడ్ రోబో కారణంగా ఆ ఓపెనింగ్ కార్యక్రమం మరింత స్పెషల్ గా మారిపోయింది.

Advertisement

Read Also: క్యాబ్‌పై కూర్చుని వర్క్.. ఈ ఐటీ ఉద్యోగి కేక!

Tags

Related News

తెలుగు రాష్ట్రాల మధ్య మరో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే.. రూ.25,000 కోట్ల మెగా ప్లాన్!

ప్రకృతి అందాల నడుమ వందేభారత్ ప్రయాణం.. ఈ 6 రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

షాకింగ్ స్మగ్లింగ్ ప్లాన్.. నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్.. ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ప్రయాణికుడు!

రైలులో మందుకొట్టిన ప్రయాణికులు.. ఫిర్యాదు చేసినా చర్యలేవీ?

క్యాబ్‌పై కూర్చుని వర్క్.. ఈ ఐటీ ఉద్యోగి కేక!

టీటీఈ పర్మిషన్ లేకుండా.. రైలులో రిజర్వ్ సీట్లు మార్చుకోవచ్చా? చట్టం ఏం చెబుతోంది?

పరందూర్ ఎయిర్‌పోర్ట్ రద్దు.. విజయ్ నిర్ణయం సరైనదేనా? ఎందుకీ నిర్ణయం?

Big Stories

Advertisement
×