BigTV English

Nagavamshi: పెద్ద హీరోలు సంక్రాంతి నుంచి తప్పుకోవాలి.. చిన్న సినిమాలకు ఛాన్స్ ఇవ్వండి!

Nagavamshi: పెద్ద హీరోలు సంక్రాంతి నుంచి తప్పుకోవాలి.. చిన్న సినిమాలకు ఛాన్స్ ఇవ్వండి!

Nagavamshi:  టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగ వంశీ(Nagavamshi) ప్రస్తుతం కింగ్ డం(King Dom) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో  విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sree Borse) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూలై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నాగ వంశీ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ వంశీ సంక్రాంతి సినిమాల (Sankranthi Movies)గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి పెద్ద ఎత్తున ఈ పండుగను పురస్కరించుకొని చిన్న సినిమాల నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలవుతూ ఉంటాయి.


చిన్న సినిమాలకు అవకాశం…

సంక్రాంతి పండుగ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీ నెలకొంటుంది. ఈ తరుణంలోనే నాగ వంశి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ బరిలో పెద్ద హీరోల సినిమాలు విడుదల చేయకపోవడం మంచిదని, పెద్ద హీరోలు సంక్రాంతి భరి నుంచి తప్పుకుంటేనే చిన్న సినిమాలు బ్రతుకుతాయని ఈయన తెలిపారు. స్టార్ హీరోల సినిమాలు ఏడాదిలో ఎప్పుడు వచ్చినా అద్భుతమైన కలెక్షన్లు రాబడతాయి. ప్రభాస్ నటించిన కల్కి, పుష్ప 2 వంటి సినిమాలు సంక్రాంతి బరిలో కాకుండా తదుపరి ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాయి.


పెద్ద సినిమాలు ఎప్పుడొచ్చినా హిట్టే..

ఇలా స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు విడుదలైన మంచి కలెక్షన్లు వస్తాయి . అందుకే పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో దిగకుండా ఉంటే మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిన్న సినిమాలను విడుదల చేస్తే మంచి కలెక్షన్లను అందుకోవడమే కాకుండా నిర్మాతలకు కూడా నష్టాలు ఉండవు అలాగే చిన్న సినిమాలను కూడా ప్రోత్సహించినట్టు ఉంటుందని ఈయన తెలియజేశారు. సంక్రాంతి సినిమాల విషయంలో నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సమంజసంంగానే ఉన్నాయని చెప్పాలి.

కింగ్ డం పైనే ఆశలు…

సంక్రాంతి సినిమాల విషయంలో నాగ వంశీ ఆలోచన ఆచరణలోకి వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కింగ్ డం విషయానికి వస్తే… ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీలో సామ్రాజ్యం అనే పేరిట ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక తెలుగులో పెద్ద ఎత్తున నిర్మాత నాగ వంశీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఈయన ఇటీవల హాస్పిటల్ లో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా ప్రమోషన్లలో భాగం కాబోతున్నారు. గత కొంతకాలంగా ఎలాంటి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ, ఆయన అభిమానులు కింగ్ డం సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: HHVM: ఒక్క సీక్వెన్స్ కోసం 60 రోజులు.. హైప్ పెంచుతున్న డైరెక్టర్!

Related News

Janhvi Kapoor: తడిచీరలో దేవర బ్యూటీ అందాల విందు.. పరమ్ సుందరి రెయిన్ సాంగ్ చూశారా ..?

Kaantha: దుల్కర్- భాగ్యశ్రీ కెమిస్ట్రీ చూశారా.. ఇదేదో బాగా వర్క్ అవుట్ అయ్యేలానే ఉందే

Couple Friendly : అమ్మ బాబోయ్ ఆ కిస్సులు ఏంటన్నా, సంతోష్ శోభన్ రూట్ మార్చాడు భయ్యా

War2 Pre Release: వార్ 2 ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధం… ఎప్పుడు.. ఎక్కడంటే?

Nagarjuna: కూలీ సినిమాతో పాటు ఆ బ్లాక్ బస్టర్ సినిమా ట్రైలర్, నాగార్జున మామూలు ప్లానింగ్ కాదు.

Aishwarya Rai: అత్యంత ధనవంతురాలిగా 2వ స్థానం.. ఐశ్వర్య ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే?

Big Stories

×