నల్లగా ఉంటే ఆత్మ స్థైరం ఉండదు. పొట్టిగా ఉంటే ఆత్మవిశ్వాసం కోల్పోతారు. లావుగా ఉంటే చూసేందుకు వికారంగా ఉంటుందంటూ చాలా మంది చాలా మాటలు చెప్తుంటారు. ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో నల్లగా ఉన్నవాళ్లు తెల్లగా మారేందుకు, పొట్టిగా ఉన్నవాళ్లు పొడవు అయ్యేందుకు, లావుగా ఉన్న వాళ్లు సన్నగా అయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నాలు చాలా వరకు ముప్పుతో కూడుకున్న వ్యవహారం అంటున్నారు నిపుణులు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య కంటే తక్కువ ఎత్తు ఉన్నానే ఉద్దేశంతో ఆమె కంటే పొడవు పెరగాలని కాళ్ల పొడిగింపు ఆపరేషన్ చేయించుకన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పొడవు పెరిగేందుకు ఏం చేశాడంటే?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే, ఇందులో ఆయన భార్య తనకంటే ఒక ఇంచు ఎక్కవ ఎత్తు ఉంటుంది. ఆమె కంటే కాస్త ఎత్తుగా పెరిగాలనే ఉద్దేశంతో.. కాళ్ళ పొడిగింపు శస్త్రచికిత్స గురించి తెలుసుకున్నాడు. దీనినే ‘కాస్మెటిక్ లెగ్ లెంగ్టెనింగ్ సర్జరీ’ అని కూడా పిలుస్తారు. అయితే, ఇది సాధారణంగా ఎత్తు పెంచడానికి, అంటే భార్య కంటే ఎక్కువ ఎత్తుగా ఉండటానికి లేదంటే మరింత అందంగా, పొడవుగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేయించుకుంటారు. అలాగే సదరు వ్యక్తి కూడా ఈ ఆపరేషన చేయించుకుని రెండు అంగుళాలు ఎత్తు పెరుగుతాడు.
‘కాస్మెటిక్ లెగ్ లెంగ్టెనింగ్ సర్జరీ’ ఎలా చేస్తారు?
సాధారణంగా ఈ శస్త్రచికిత్సలో ఎముకను విడదీసి, మధ్యలో ఖాళీ ఏర్పరుస్తారు. ఆ ఖాళీని క్రమంగా కొత్త ఎముకతో నింపడానికి, ఒక ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో ఎముక పెరుగుదలను ప్రేరేపించడానికి కొన్ని వారాలు, నెలలు పడుతుంది. ఆ తర్వాత ఎముకల మధ్య గ్యాప్ లో కొత్త ఎముక ఏర్పడుతుంది. ఫలితంగా ఈ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ ఆపరేషన్ తో సమస్యలు తప్పవా?
నిజానికి ‘కాస్మెటిక్ లెగ్ లెంగ్టెనింగ్ సర్జరీ’ తో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిలో ఇన్ఫెక్షన్, నరాలు దెబ్బతినడం, నొప్పి, ఎముక సరిగా కలవకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాదు, కొన్నిసార్లు మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఎత్తు పెరగడం వల్ల కలిగే ఆనందం కంటే, ఈ శస్త్రచికిత్సతో ముడిపడి ఉన్న నొప్పులు, సమస్యలు మానసికంగా ఒత్తిడిని కలిగిస్తాయి. కొన్నిసార్లు జీవితం అంతా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎముకలు సరిగా కలవకపోతే లేచి నడవడం కూడా సాధ్యం కాదు. ఈ చికిత్స అత్యంత ఖరీదైనది కూడా. లక్షల రూపాయలు ఖర్చవుతుంది. వైద్య ఖర్చులు, ఫిజియోథెరపీ, అనేక ఇతర ఖర్చులు ఉంటాయి. అన్ని చేసినా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందనే గ్యారెంటీ కూడా లేదంటున్నారు నిపుణులు. వీలైనంత వరకు ఈ ఆపరేషన్ కు దూరంగా ఉండటం మంచిదంటున్నారు.
Read Also: తానే నా పెళ్ళాం అంటూ 760 కిలోమీటర్లు కష్టపడి వెళ్ళాడు.. ఆమె భర్త ఎదురయ్యేసరికి..