HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా మరొక మూడు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నప్పటికీ ఇతర చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు జ్యోతి కృష్ణ(Jyothi Krishna), నటి నిధి అగర్వాల్(Nidhi Agerwel), నిర్మాత ఎ.ఎం. రత్నం(A.M.Ratnam) ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. హిస్టారికల్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్స్ సన్ని వేషాలు ఉన్నాయని ఇదివరకు చేసిన ప్రమోషనల్ కంటెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది.
యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసిన పవన్..
ఈ యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున కష్టపడినట్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ వెల్లడించారు. ముక్యంగా ఒక సీక్వెన్స్ చేయడం కోసం సుమారు 60 రోజులపాటు సమయం పట్టిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ పవన్ కళ్యాణ్ ప్లాన్ చేయటం విశేషం. ఈ యాక్షన్ సీక్వెన్స్ బ్రూస్ లీ, ఎంటర్ ది డ్రాగన్ ను తలపించే భారీ ఫైట్ సన్నివేశమని తెలియజేశారు. ఈ సన్నివేశాన్ని పవన్ కళ్యాణ్ డిజైన్ చేసినట్లు జ్యోతి కృష్ణ తెలియజేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
తప్పుకున్న క్రిష్..
ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే నటించారని, ఎక్కడ కూడా డూప్ నటించలేదు అంటూ జ్యోతి కృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా గురించి ఎన్నో అంచనాలు పెంచుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ సినిమాకు దర్శకుడుగా క్రిష్ జాగర్లమూడి ఎంపిక అయినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆయన తప్పుకోవడంతో నిర్మాత ఏ.యం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వపు బాధ్యతలను స్వీకరించారు. ఇక ఈ సినిమా ఇప్పటికే చూసిన పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా వచ్చిందని ఆయన దర్శకత్వ ప్రతిభ పై ప్రశంసలు కురిపించినట్లు వెల్లడించారు.
మొదటి పాన్ ఇండియా సినిమా..
ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి. జులై 24వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా హిందీలో విడుదల అవుతున్నప్పటికీ హిందీలో మాత్రం ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించలేదు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ప్రమోషన్లను నిర్వహిస్తూ చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి వీరమల్లు సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Film Industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత!