BigTV English

Nara Rohith: నేను ‘వార్‌ 2’ సినిమా చూడలేదు.. నారా రోహిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Nara Rohith: నేను ‘వార్‌ 2’ సినిమా చూడలేదు.. నారా రోహిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Nara Rohith Comments on War 2: నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాబాయ్‌ నందమూరి బాలకృష్ణ, అబ్బాయ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌లు మాట్లాడుకోవడం లేదనే విషయం విధితమే. ఈ మనస్పర్థలు నందమూరి హరికృష్ణ ఉన్నప్పటి నుంచో ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు ఎవరూ బయటపడటం లేదు. కానీ, వారి తీరు చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్‌, బాలయ్యల మధ్య చాలా గ్యాప్ ఉందనేది అర్థమైపోతుంది. అంతేకాదు టీడీపీ తీరు కూడా అలాగే ఉంది. వార్‌ 2 రిలీజ్ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌.. ఎన్టీఆర్‌ను తిడుతూ.. వార్‌ 2 సినిమా చూడోద్దని ఫోన్‌లో మాట్లాడిన ఆడియో ఒకటి లీకైంది. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ నుంచి అతడిపై ఫైర్‌ అయ్యారు.


వార్ 2 మూవీ చూడలేదు: రోహిత్

అయితే ఇది తన వాయస్‌ కాదని, ఎవరో ఫేక్‌ చేశారంటూ వివరణ ఇచ్చుకున్నారు. కానీ, దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎంతోకాలంగా ఎన్టీఆర్‌ను నందమూరి,నారా ఫ్యామిలీ దూరం పెడుతుందనే ప్రచారం జరుగుతుంది. కానీ, దీనిపై ఎప్పుడు ఈ రెండు కుటుంబాలు నోరు విప్పలేదు. అయితే తాజాగా నారా రోహిత్‌ కామెంట్స్‌ ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తాను వార్‌ 2 సినిమా చూడలేదన్నాడు. అతడి కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అయ్యాయి. స్వయాన బావమరిది సినిమా చూడకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నారా రోహిత్‌ మాట్లాడుతూ.. “నాది చాలా కామన్‌ ఆడియన్స్‌ మైండ్‌ సెట్‌. ట్రైలర్ నచ్చితేనే సినిమా చూస్తా. అలా ట్రైలర్ నచ్చకపోతే చూడని సినిమాలు చాలానే ఉన్నాయి. రీసెంట్‌గా కూలీ మూవీ ట్రైలర్‌ నచ్చడంతో సినిమా చూశాను. సినిమా అంత బాగాలేదు.


నందమూరి, నారా ఫ్యామిలీ ఎన్టీఆర్ ను పక్కన పెట్టిందా?

కానీ, మూవీలో కొన్ని సీన్స్‌ బాగున్నాయి. ఓవరాల్‌గా సినిమా పర్లేదు అనిపించింది. కానీ, వార్‌ 2 మూవీ నేను చూడలేదు. నా ఫ్రెండ్స్‌ కూలీ సినిమా చూసేందుకే ఆసక్తి చూపించారు. అందుకే వార్‌ 2 మూవీకి వెళ్లలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. నారా రోహిత్‌ కామెంట్స్‌ మరోసారి నందమూరి ఫ్యామిలీ విభేదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌ని నందమూరి, నారా కుటుంబాలు దూరం పెడుతున్నాయన్న వాదనలకు ఇవి మరింత బలాన్ని ఇస్తున్నాయి. కూలీ మూవీ చూసిన నారా రోహిత్‌.. సొంత బావమరిది సినిమా చూడకపోవడమేంటని అంత షాక్‌ అవుతున్నారు. కాగా బాబాయ్‌,అబ్బాయ్‌ మధ్య కూడా మాటల్లేవ్ అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎన్టీఆర్ మూవీ ఈవెంట్స్‌లో బాలయ్య కానీ, బాలయ్య మూవీ ఈవెంట్స్‌లో ఎన్టీఆర్‌ కానీ కనిపించడం లేదు. ఒకరి సినిమాలకు ఒకరు విష్‌ చేసుకోవడం లేదు.

ఇటీవల ఓ ఈవెంట్‌లో బాలయ్యను మీ వారసులు ఎవరూ అని ప్రశ్నించగా.. నా కొడుకు, నా మనవడు ఇంకేవరుంటారు అంటూ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లను పక్కన పెట్టాడు. తారక్‌ కూడా ఓ కార్యక్రమంలో ఎవరూ అవునన్నా.. కాదన్నా.. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ అనేది తమ సొంతమని, తాము ఎన్టీఆర్‌ వారసులమే.. బల్లగుద్ది చెప్పారు. ఇది మీకు జీర్ణం అయినా, కాకపోయినా.. మేము నందమూరి వారసులమే అంటూ పరోక్షంగా నందమూరి ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల ‘వార్‌ 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ తనకంటూ ఎవరూ లేరని, ముందు నుంచి తన తండ్రి, తన తల్లి మాత్రమే తన పక్కన ఉన్నారంటూ నందమూరి ఫ్యామిలీపై ఇన్‌డైరెక్ట్‌ కామెంట్స్‌ చేశాడు. ఇప్పుడు నారా రోహిత్‌ కూడా తారక్‌ వార్‌ 2 మూవీ చూడలేదని చెప్పడంతో నందమూరి, నారా కుటుంబంలో ఏం జరుగుతోందనే సందేహాలు వస్తున్నాయి. మరి వీటన్నింటీకి ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

Also Read: HHVM Losses: వీరమల్లు నష్టాలు… బయ్యర్లపై పడిన భారమెంతంటే!

Related News

Rukmini Vasanth: క్రష్ ట్యాగ్ పై రుక్మిణి షాకింగ్ రియాక్షన్.. తాత్కాలికం అంటూ!

Rishabh shetty: ఆ ఘర్షణ నుంచే కాంతార కథ పుట్టింది.. అసలు విషయం చెప్పిన రిషబ్!

Rajinikanth: మళ్లీ హిమాలయాలకు రజనీకాంత్.. కారణమేంటంటే!

Rukmini Vasanth Father: రుక్మిణి వసంత్ తండ్రికి అశోక చక్ర పురస్కారం.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Raashii Khanna: టాలీవుడ్ -బాలీవుడ్ కి అదే తేడా.. పని గంటలపై రచ్చ లేపిందిగా?

khushboo:కరూర్ ఘటన పక్కా ప్లానింగ్.. అనుమానాలు రేకెత్తించిన ఖుష్బూ!

Kantara: Chapter 1: థియేటర్ లోకి పంజుర్లి దేవుడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో!

Tollywood: పిక్ ఆఫ్ ది డే.. 80స్ స్టార్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో.. పైగా స్పెషల్ థీమ్!

Big Stories

×