Naga Chaitanya:అక్కినేని వారసుడు నాగచైతన్య (Naga Chaitanya) రెండో వివాహం తర్వాత కాస్త జోరు పెంచినట్లు అనిపిస్తోంది. అందులో భాగంగానే ‘తండేల్’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈయన.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మొదట్లో దేవర(Devara ) డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తో నాగచైతన్య సినిమా చేస్తున్నారని వార్తలు రాగా.. ఇప్పుడు అందులో నిజం లేదని తేలిపోయింది. ముఖ్యంగా నాగచైతన్య దేవర డైరెక్టర్ కొరటాల శివతో కాకుండా దేవర సినిమాను నిర్మించిన నిర్మాతలతో తన కొత్త సినిమా చేయబోతున్నారని సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
దేవర డైరెక్టర్ తో కాదు.. దేవర నిర్మాతలతో..
అసలు విషయంలోకి వెళ్తే.. గత కొద్ది రోజులుగా నాగచైతన్య, కొరటాల శివ ప్రాజెక్టు త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దేవర సినిమాను నిర్మించిన యువసుధా ఆర్ట్స్ బ్యానర్ వారు నాగచైతన్యతో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇంకా దీనికి డైరెక్టర్ కన్ఫామ్ కాలేదు. మొత్తానికి అయితే కొరటాల శివతో నాగచైతన్య సినిమా చేయబోతున్నారు అనే వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి నాగచైతన్య యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై చేస్తున్న సినిమాలో హీరోయిన్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? కథ ఏ జానర్ కి సంబంధించింది? ఇలా పలు విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆసక్తి కనుబరుస్తున్నారు.
నాగచైతన్య కెరియర్..
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాగచైతన్య. వాసు వర్మ (Vasu Varma)దర్శకత్వంలో దిల్ రాజు (Dilraju ) నిర్మాణంలో ప్రముఖ సీనియర్ నటి రాధా(Radha ) కూతురు కార్తీక(Karthika ) హీరోయిన్ గా వచ్చిన ‘జోష్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈయన.. మొదటి సినిమాతోనే డీలా పడిపోయారు. అయినా సరే ఉత్తమ నటుడు విభాగంలో ఫిలింఫేర్, నంది అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత గౌతం మీనన్ (Gautam Menon)దర్శకత్వంలో సమంత(Samantha ) హీరోయిన్గా వచ్చిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘100% లవ్కి తో మరో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత దడ, బెజవాడ , తడాఖా, మనం ఇలా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగచైతన్య.
సమంతతో పెళ్లి, విడాకులు..
ఏ మాయ చేసావే సినిమా సమయంలోనే సమంతతో ప్రేమలో పడ్డ నాగార్జున.. 2017లో కుటుంబ సభ్యులను ఒప్పించి , వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నాగచైతన్య. అంతేకాదు తన మామ వెంకటేష్(Venkatesh ) తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేసి మరో విజయం అందుకున్నారు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు.. కలిసి సినిమాలు చేస్తారు అనుకునే లోపే అనూహ్యంగా పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. విడాకుల తర్వాత ఈ జంట ఎవరి కెరియర్ పై వారు ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇక రెండేళ్ల విరామం తర్వాత శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డ నాగచైతన్య.. 2024 డిసెంబర్లో అన్నపూర్ణ స్టూడియోలో ఆమెను రెండో వివాహం చేసుకున్నారు.
ALSO READ:CM Revanth on Tollywood : నిర్మాతలు – సినీ కార్మికుల ఇష్యూ… రంగంలోకి దిగిన సీఎం రేవంత్