BigTV English

Raghava Lawrence: హీరోగా పరిచయం అవుతున్న రాఘవ లారెన్స్ తమ్ముడు, యాక్షన్ థ్రిల్లర్ తో ఎంట్రీ

Raghava Lawrence: హీరోగా పరిచయం అవుతున్న రాఘవ లారెన్స్ తమ్ముడు, యాక్షన్ థ్రిల్లర్ తో ఎంట్రీ

Raghava Lawrence: రాఘవ లారెన్స్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగు స్టార్ హీరోలకు కేవలం కొరియోగ్రఫీ చేయడం మాత్రమే కాకుండా, దర్శకుడుగా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నాడు. అలానే నటుడుగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీటన్నిటిని మించి రాఘవ లారెన్స్ వ్యక్తిత్వానికి చాలామంది అభిమానులు ఉన్నారు.


రాఘవ లారెన్స్ తెలుగులో ప్రభాస్ హీరోగా రెబల్ అనే సినిమాను చేశారు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ డైరెక్షన్ చేయలేదు. ఒకవైపు కాంఛన సినిమాకు సీక్వెల్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ తరుణంలో తన తమ్ముడు ఎల్విన్ లారెన్స్ ను హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్ తో ఎంట్రీ 


ఎల్విన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా బుల్లెట్. ఈ సినిమాను తెలుగులో బుల్లెట్ బండి పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కొద్దిసేపటి గతమే విడుదలైంది. ఈ టీజర్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా థ్రిల్లర్ అని అర్థమవుతుంది. అలానే చాలా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు.. రాఘవ లారెన్స్ “నా సోదరుడు ఎల్విన్ “బుల్లెట్” యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రజెంట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. అతను చాలా ప్రతిభావంతుడు మరియు కష్టపడి పనిచేసే నటుడు. నేను ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాను. మీరందరూ అతనికి మరియు ఈ చిత్రానికి మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నాను.”అంటూ అప్పట్లో ఈ సినిమా గురించి ట్వీట్ వేశాడు.

ఈ టీజర్ లో ఎల్విన్ కొన్నిచోట్ల రాఘవ లారెన్స్ లానే అనిపించాడు. కొద్దిగా అతని మేనరిజమ్స్ కూడా మనం టీజర్ లో గమనించవచ్చు.ఈ చిత్రానికి గతంలో “డైరీ” చిత్రానికి దర్శకత్వం వహించి నిర్మించిన ఇన్నాసి పాండియన్ దర్శకత్వం వహించారు. శ్యామ్ సి ఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. శ్యామ్ పుష్ప 2 సినిమా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కేవలం కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా డైరెక్షన్, నటుడుగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు  లారెన్స్. ఇక ప్రస్తుతం తన సోదరుడు ఏ స్థాయిలో ఉంటాడో చూడాలి.

Also Read: Lokesh Kanagaraj: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×