Hit 3 : న్యాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ హిట్ విజయాలను సొంతం చేసుకుంటూ పోతున్నాడు. గత ఏడాది రెండు సినిమాలతో పలకరించాడు. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. రీసెంట్ గా హిట్ 3 మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ యాక్షన్ సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ మూవీ హిట్ మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. గతంలో వచ్చిన హిట్, హిట్ 2 భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వాటికి సీక్వెల్ గానే హిట్ 3 వచ్చింది. మేడే సందర్బంగా ఇది థియేటర్లలోకి వచ్చేసింది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఇటీవల ఓటీటీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా అంతా సాఫిగా సాగుతుంది అని అనుకొనేలోపు బిగ్ షాక్ ఎదురైంది. ఈ స్టోరీ తనదే అంటూ ఓ డైరెక్టర్ కాపీ రైట్స్ కేసు వేశారు. మరి దీనిపై నాని టీమ్ రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
హిట్ 3 పై కాపీ రైట్ కేసు..
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్‌లో హిట్ వర్స్‌లో భాగంగా హిట్1, హిట్2 చిత్రాలకు సీక్వెల్‌గా మే1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం హిట్3. గత నెలలో రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది. విడుదలైప అన్ని చోట్లా మంచి టాక్తో రన్ అవుతూ.. రూ. 200 కోట్ల వరకు వసూళ్లు సాధించి నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. నాని తొలిసారి ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. ఒకవైపు ఎక్కువ హింస ఉందని విమర్శలు ఎదురైనా కూడా మూవీ మాత్రం సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఇదంతా పక్కనపెడితే ఈ మూవీ స్టోరీ నాదే అంటూ నాని వీరాభిమాని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..
గతంలో డైరెక్టర్ శైలేష్ కొలను హిట్, సైంథవ్ సినిమాల విషయంలో కొన్ని సినిమాలను కాపీ కొట్టాడంటూ అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి. కాలక్రమంలో ఆడియన్స్ ఆ విషయాన్ని మరిచి పోయినా ఏదో ఓ సందర్భంలో కాపీ విషయం బయటకు వస్తూ పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు హిట్ 3 మూవీ పరిస్థితి కూడా అదే ఉంది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఓ తెలుగు సీరియల్‌ను మక్కీ టు మక్కీ దించేశారంటూ సదరు వీడియోలు బయట పెట్టి ట్రోల్ చేశారు.. అలాగే స్క్విడ్ గేమ్‌ను కాపీ చేశారంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. శుక్రవారం ఆ సినిమాలు స్పెషల్..
హిట్ 3 మొత్తం అదే స్టోరీ..?
హీరో నానికి అభిమాని అయిన మహిళా రచయిత విమల్ సోనీ విమర్శలు చేసింది. తాను రాసిన ఏజెంట్ 11 సీక్వెల్ మూవీస్ స్టోరీని కాపీ కొట్టి హిట్ 3 సినిమా తీశారని పేర్కొంటూ సదరు రచయిత హిట్ 3 సినిమా మేకర్స్ పై మద్రాస్ హైకోర్టు లో కాపీ రైట్ కేసు వేసి షాకిచ్చింది. ఈ కేసు పై హిట్ 3 యూనిట్ ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది.. ఏది ఏమైన ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.. నాని సినిమాల విషయానికొస్తే.. ది ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నాడు. త్వరలోనే ఆ మూవీ థియేటర్లలోకి వచ్చేస్తుంది.