OTT Movie : ఫ్యామిలీ డ్రామాతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు కుటుంబం తో సహా చూస్తూ ఆనందిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో మేనల్లుడిని అమితంగా ప్రేమించే మేనమామ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. తమిళ హాస్య నటుడు సూరి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
జీ 5 (ZEE5) లో
ఈ తమిళ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు’మామన్’ (Maaman). 2025 లో వచ్చిన ఈ సినిమాకి ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహించారు. సూరి కథ రాసిన ఈ సినిమాలో సూరి, ఐశ్వర్య లక్ష్మి, స్వసిక, రాజ్‌కిరణ్, బాల సరవణన్, బాబా భాస్కర్, విజి చంద్రశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మే 16, 2025న థియేటర్లలో విడుదలైంది. ఇది జూన్ 19 నుంచి జీ 5 (ZEE5) లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలలొ స్ట్రీమింగ్‌లో ఉంది. 2 గంటల 32 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 6.3/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
కథ తిరుచ్చిలో ఒక ఉమ్మడి కుటుంబంలో జరుగుతుంది. ఇక్కడ ఇన్బా (సూరి) తన అక్క గిరిజా (స్వసిక)ను ఎక్కువగా అభిమానిస్తుంటాడు. గిరిజా పెళ్లి చేసుకుని దాదాపు పదేళ్లపాటు సంతానం కలగక సమాజం నుండి, ముఖ్యంగా ఆమె అత్తగారి నుండి, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. ఆమె గర్భవతి కావడానికి ఎన్నో ఆలయాలను, హాస్పిటల్స్ ను సందర్శిస్తుంది. ఈ సమయంలో, ఇన్బా తన అక్కకు అండగా నిలబడతాడు. ఆమె బాధలను తనవిగా భావిస్తాడు. ఇక చాలాకాలం తరువాత గిరిజా ఒక బాబుకు జన్మనిస్తుంది. అతనికి లడ్డు అనే పేరు కూడా పెడతారు. ఇన్బాకు లడ్డు పుట్టడం ఒక పెద్ద ఆనందం. అతను తన మేనల్లుడిని ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. లడ్డు కూడా ఇన్బాతో అనుబంధాన్ని పెంచుకుంటాడు.
ఈ సమయంలో, గిరిజా కోసం ఇన్బా డాక్టర్ రేఖా (ఐశ్వర్య లక్ష్మి)ని కలుస్తాడు. ఇన్బా ఆకర్షణీయమైన స్వభావం, అక్కపై చూపించే శ్రద్ధ రేఖాకు నచ్చుతాయి వారిద్దరూ ప్రేమలో పడతారు. ఐదేళ్ల తర్వాత, ఇన్బా, రేఖా వివాహం చేసుకుంటారు. అయితే, ఇన్బా, లడ్డు మధ్య ఉన్న బంధం మొదట్లో అందరికీ మంచిగా అనిపించినప్పటికీ, వివాహం తర్వాత సమస్యగా మారుతుంది. లడ్డు హైపర్ యాక్టివ్ బాలుడు, ఇన్బా లేకుండా ఉండలేని స్థితిలో ఉంటాడు. ఇది ఇన్బా, రేఖా దాంపత్య జీవితంలో ఒత్తిడిని తెస్తుంది. ఎందుకంటే రేఖాకు తన భర్తతో గడపడానికి సమయం దొరకదు. లడ్డు ఇన్బాతోనే నిద్రపోవడం, వారి వివాహ వేడుకలో కూడా అతను మధ్యలో కూర్చోవాలని పట్టుబట్టడం వంటివి రేఖాకు అసౌకర్యంగా అనిపిస్తాయి. అంతే కాకుండా మొదటి రాత్రి కూడా జరుపుకోలేనంతగా ఈ వ్యవహారం నడుస్తుంది.
రేఖా తన భర్తతో కొంత సమయం గడపాలని కోరుతుంది. కానీ ఇన్బా లడ్డు మనసును గాయపరచకూడదని ఆమె అభ్యర్థనలను పట్టించుకోడు. ఇది చిన్న వాదనలుగా మొదలై, క్రమంగా పెద్ద కుటుంబ వివాదంగా మారుతుంది. గిరిజా, తన కొడుకు లడ్డు కోసం ఇన్బా ఎంతో చేస్తున్నాడని భావిస్తూ, రేఖా ఫిర్యాదులను అర్థం చేసుకోలేదు. ఇది గిరిజా, రేఖా మధ్య ఘర్షణకు దారితీస్తుంది. లడ్డు తండ్రి కూడా తన కొడుకుతో బంధం పెంచుకోలేక, ఇన్బా-లడ్డు బంధం వల్ల నీరసించిపోతాడు. ఇక ఇన్బా, లడ్డు బంధం కుటుంబంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. చివరికి ఈ మేనమామ, మేనల్లుడి బంధం ఏమవుతుంది ? కుటుంబంలో సమస్యలు కొలిక్కి వస్తాయా ? రేఖా సమస్య తీరుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : అబ్బాయే అసిస్టెంట్ గా కావాలనే లేడీ బాస్… ముసలాడే కదాని పనిలో పెట్టుకుంటే…