BigTV English
Advertisement

OTT Movie : 23 ఏళ్ల అబ్బాయితో 33 ఏళ్ల హీరోయిన్ పెళ్లి… క్రేజీ ఫేస్ బుక్ ప్రేమ

OTT Movie : 23 ఏళ్ల అబ్బాయితో 33 ఏళ్ల హీరోయిన్ పెళ్లి… క్రేజీ ఫేస్ బుక్ ప్రేమ

OTT Movie : ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి, కొత్త కొత్త స్టోరీలతో దర్శకులు ముందుకు వస్తున్నారు. అయితే మలయాళం దర్శకులు స్టోరీలను తెరకెక్కిస్తున్న విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మధ్య ఈ సినిమాలు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమాలో, ఒక జంట పదేళ్ళ వయసును తప్పుగా చూపించి, ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. ఈ ఘనకార్యం ఫేస్‌బుక్‌ నుంచి మొదలవుతుంది. ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది. మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే … 


సైనా ప్లే (Saina Play) లో

ఈ మలయాళ కామెడీ-డ్రామా మూవీ పేరు ‘పాలుం పజావుమ్’ (Paalum Pazhavum). 2024లో విడుదలైన ఈ సినిమాకి వి.కె. ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ సుమి (మీరా జాస్మిన్), సునీల్ (అశ్విన్ జోస్) అనే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ జంట ఫేస్‌బుక్ ద్వారా కలుసుకుని, వారి సంబంధం వివాహంగా మారడం వల్ల వచ్చే సమస్యలతో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా 2024 డిసెంబర్ 20 నుండి సైనా ప్లే (Saina Play) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

సుమి 33 ఏళ్ల మహిళ, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి, తన ఉపాధ్యాయ వృత్తి కూడా వదులుకుంటుంది. ఆమెకు ఒక అన్న కూడా ఉంటాడు. అయితే అతను ఉద్యోగం కోసం సిటీకి వెళ్ళిపోతాడు. ఇక తల్లి ఒక్కటే ఇంట్లో ఉండటంతో ఆమెను చూసుకునే పనిలో, ఈమెకు పెళ్లి వేయసు కూడా దాటిపోతుంది. ఇక చాలా కాలం తరువాత ఆమె ఒక బ్యాంక్ ఉద్యోగంలో చేరుతుంది. ఆమె సహోద్యోగి ఆమెను ఫేస్‌బుక్‌కు పరిచయం చేస్తుంది. అక్కడ ఆమె తన వయసును తప్పుగా ఎంటర్ చేస్తుంది. మరోవైపు సునీల్ అనే 23 ఏళ్ల బి.టెక్ యువకుడు,  చదువులో బాగా వెనకబడతాడు.  ఒక గేమింగ్ పార్లర్ ప్రారంభించాలనే డ్రీం లో ఉంటాడు.

కానీ అతని తండ్రి మద్దతు లేకపోవడంతో, ఫేస్‌బుక్‌లో కూడా తప్పుడు వయసును ఉపయోగిస్తాడు. వీళ్ళిద్దరూ ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులుగా మారతారు. వారి స్నేహం త్వరలో ప్రేమగా, ఆపై వివాహంగా మారుతుంది. అయితే 10 సంవత్సరాల వయసు తేడా, భిన్నమైన జీవనశైలి కారణంగా వీళ్ళు పెళ్ళి తరువాత అనేక సమస్యలను ఎదుర్కొంటారు.చివరికి వీళ్ళు సమాజంలో ఎదుర్కునే సమస్యలు ఏమిటి ? వీళ్ళ కాపురం సజావుగా సాగుతుందా ? అనే విషయాలను, ఈ మలయాళం సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : కోమాలో ఉన్న అమ్మాయి ప్రెగ్నెంట్… ఇలాంటి సినిమాను జీవితంలో చూసి ఉండరు భయ్యా

Related News

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Big Stories

×