Nara Rohith Wedding: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును క్రియేట్ చేసుకున్నారు నారా రోహిత్ (Nara Rohit) చివరిగా ‘ప్రతినిధి 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఇప్పుడు ‘సుందరకాండ’ అంటూ మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వెంకటేష్ నిమ్మలపూడి(Venkatesh Nimmalapudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారా ప్రముఖ సీనియర్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్(Sridevi Vijay Kumar) రీ ఎంట్రీ ఇచ్చారు. ఈమెతో పాటు వృతి వాఘాని(Vruti Vaghani) కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక వర్గం వారిని ఆకట్టుకున్నా.. కొంతమంది నుంచి నెగిటివ్ రివ్యూలు రావడం గమనార్హం.
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న నారా రోహిత్..
మొత్తానికైతే మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది. ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఈ సినిమాలో ఎవరికి వారు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు నారా రోహిత్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన శిరీష లెల్ల (Sirisha lella) తో 2024 అక్టోబర్ 13న హైదరాబాదులోని హైటెక్స్ నోవాటెల్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. గత ఏడాది కాలంగా వివాహం ఎప్పుడు చేసుకుంటారు అనే వార్తలు వినిపిస్తుండగా తాజాగా అభిమానులకు శుభవార్త తెలిపారు.
పెళ్లి అప్పుడే..
అక్టోబర్ ఆఖరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఇకపోతే అటు బాలకృష్ణ (Balakrishna) వదిన పద్మజ (Padmaja) మరణంతో ఇటు నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలని అంటారు కదా.. అందులో భాగంగానే నందమూరి ఇంట్లో అశుభం జరిగినప్పటికీ.. నారా వారి ఇంట్లో పెళ్లి జరిపించి.. అన్నింటికీ చెక్ పెట్టాలని చూస్తున్నారట. ముఖ్యంగా బాధల్లో ఉన్న అందరికీ స్వాంతన ఈ పెళ్లి ద్వారా కలిగించబోతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే మరో రెండు నెలల్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నారా రోహిత్, శిరీషల వివాహం జరిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలవడునున్నట్లు తెలుస్తోంది.
నారా రోహిత్ రాజకీయ ఎంట్రీ..
ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలు నిర్మించిన ఈయన.. ఇప్పుడు రాజకీయ ఎంట్రీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికలలో నారా రోహిత్ పోటీ చేస్తారని వార్తలు రాగా.. ఇటీవల ‘సుందరాకాండ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రస్తుతం అలాంటి ఆలోచనలు లేవని, కానీ ఖచ్చితంగా రాజకీయాలలోకి వస్తే అభిమానులతో చెప్పే రాజకీయాల్లోకి వస్తానని” క్లారిటీ ఇచ్చారు నారా రోహిత్. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మినిస్టర్ నారా లోకేష్ ల అండ ఉండడంతో అటు తండ్రి రాజకీయ పరంపరను కొనసాగించడానికి నారా రోహిత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.