Afghanistan Earthquake: ఆప్ఘనిస్తాన్‌ను భూకంపం వణికించింది. ఆదివారం రాత్రి తూర్పు ప్రాంతంలో అర్థరాత్రి సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.0గా నమోదు అయ్యింది. కొద్ది క్షణాలకే మరొకటి సంభవించింది. రెండోసారి వచ్చిన భూకంపం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో వచ్చినట్టు తెలుస్తోంది. వరుసగా వచ్చిన భూకంపాల వద్ద దాదాపు 250 మందికి పైగా మృతి చెంది ఉంటారని పలు న్యూస్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
అఫ్గానిస్థాన్ ఆదివారం రాత్రి తూర్పు ప్రాంతంలో అర్థరాత్రి 12 గంటల సమయంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6 గా నమోదు అయ్యింది. కొద్దిక్షణాల తర్వాత ఆఫ్ఘాన్-పాకిస్తాన్ బోర్డర్ సమీపంలో మరొకటి వచ్చింది. నంగర్‌హార్ ప్రావిన్స్ జలాలాబాద్ సమీపంలో 8 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు.
పావు గంట తర్వాత ఆ ప్రావిన్స్‌లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. అయితే వరుస భూకంపాల వల్ల పలువురు మరణించిన స్థానిక న్యూస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆఫ్గానిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. అనడోలు ఏజెన్సీ 250 మందికి పైగా మరణించారని పేర్కొంది. క్షతగ్రాతులు 500 మంది ఉంటారని తెలియజేసింది.
ఈ భూకంపానికి కునార్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని వెల్లడించింది. రెండుసార్లు వచ్చిన భూకంపాల వల్ల పలు గ్రామాలను నేలమట్టం చేసిందన్నారు మైదాన్ షహర్ మాజీ మేయర్ జరీఫా గఫారీ. కునార్, నంగర్‌హార్, నోరిస్తాన్ ప్రావిన్సులు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు.
ALSO READ: జిన్ పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ.. ఏనుగు-డ్రాగన్ ఒక్కటవ్వాలని సూచన
ప్రాణం, ఆస్తి నష్టం భారీగా ఉండవచ్చన్నారు. వేలాది మంది పిల్లలు, మహిళలు గాయపడగా, వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. అంతర్జాతీయ సమాజం సహాయం అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తొలి నివేదికల ప్రకారం ఓ గ్రామంలో ఏకంగా 30 మంది మరణించినట్లు ఆఫ్గాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
చిన్న చిన్న గ్రామాల్లో ఇంకా ఖచ్చితమైన ప్రాణనష్ట గణాంకాలు సేకరించాల్సి ఉందని తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం తరచూ భూకంపాలకు గురవుతుంది. ఎందుకంటే హిందూ కుష్ పర్వత శ్రేణిలో భారత-యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలుస్తాయని, ఈ క్రమంలో వాటి ప్రభావం ఆదేశంపై ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
గతేడాది పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భూకంపాల వల్ల దాదాపు 1,500 మందికి పైగా మృతి చెందిన విషయం తెల్సిందే. గత శుక్రవారం నుంచి ఆఫ్ఘాన్ తూర్పు ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టించాయి. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో భూకంపం వణికించింది.
అఫ్గానిస్థాన్‌లో భూకంపాల విధ్వంసం.. వందలాది మంది మృతి?
ఆదివారం అర్ధరాత్రి బలమైన భూకంపాలు
రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదు
భారీ ప్రకంపనలతో నేల కూలిన ఇళ్లు
జలాలాబాద్‌కు 27 కి.మీ దూరంలో భూకంప కేంద్రం
వందలాది మంది మృతి చెంది ఉంటారని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడి… pic.twitter.com/DWakg6wvSi
— BIG TV Breaking News (@bigtvtelugu) September 1, 2025