Aadarsha kutumbam AK 47:ప్రస్తుతం ఎక్కడ చూసినా చైల్డ్ ఆర్టిస్ట్ రాజా ప్రజ్వల్ (Raja Prajwal) పేరు ప్రత్యేకంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం ఏకే 47. శ్రీనిధి శెట్టి (Shrinidhi Shetty) హీరోయిన్గా నారా రోహిత్ (Nara Rohit), నివేదా పేతురాజ్( Nivetha pethuraj) , యువినా పార్థవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులోని శిల్పకళ వేదికగా నిర్వహించారు. ఈ సినిమాలో వెంకటేష్ కొడుకుగా , చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినా రాజా ప్రజ్వల్ (Raja Prajwal) ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై అదిరిపోయే స్పీచ్ ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు..
ముఖ్యంగా త్రివిక్రమ్ ను మొదలుకొని హీరో వెంకటేష్, హీరోయిన్ త్రివిక్రమ్, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆఖరికి యాంకర్ సుమా పై కూడా తన యాస , ప్రాసలతో మాట్లాడి ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇటీవలే మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మల్లారెడ్డినే ఇమిటేట్ చేస్తూ.. మల్లారెడ్డి కోడలు చేతే ప్రశంసలు అందుకున్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోసారి తన స్పీచ్తో అదరగొట్టేశారు.
తెలుగు ప్రేక్షకులందరికీ అంటూ మొదలుపెట్టిన రాజా ప్రజ్వల్.. 22 ఏళ్లుగా త్రివిక్రమ్, వెంకటేష్ గార్ల కాంబినేషన్లో మూవీ కోసం ఎదురుచూసిన ప్రతి ఒక్కరికి సమయం ఆసన్నమైంది. రాముడి వెనుక వానర సైన్యం బయలుదేరినట్లు.. త్రివిక్రమ్ వెనుక విజయ బాటలో బయలుదేరిన వానరుల్లో నేను కూడా ఒకడిని.. మొక్కకు పూసిన ప్రతి పువ్వు ఎలా అయితే దేవుడిని చేరాలని కోరుకుంటుందో.. తయారైన ప్రతి పెన్ను బహుశా త్రివిక్రమ్ గారి చేతుల్లోకి రావాలని ఆశపడుతుంది అంటూ తనదైన శైలిలో కవిత్వాలు వళ్లి ఈవెంట్లో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక దీంతో ఎవరీ రాజా ప్రజ్వల్? ఇతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ నెటిజెన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.
also read:చైనా రెస్టారెంట్ లో డ్యాన్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం?
రాజా ప్రజ్వల్ విషయానికి వస్తే.. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన డ్రామా జూనియర్స్ సీజన్ 5 విజేతగా నిలిచారు. అంతేకాదు ఇదే షోలో “జూనియర్ బాలయ్య”గా గుర్తింపు తెచ్చుకున్నారు. 35 చిన్న కథ కాదు అనే చిత్రంలో క్లాస్ మానిటర్ పాత్ర పోషించిన రాజా ప్రజ్వల్.. పడమటి సంధ్యారాగం చిత్రంలో బిట్టు పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక 2024 లో వచ్చిన డ్రింకర్ సాయి, 2025 లో వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాలలో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న రాజా ప్రజ్వల్.. ప్రస్తుతం ఆదర్శ కుటుంబం చిత్రంలో సర్వ అనే పాత్రలో నటిస్తున్నారు . ఇకపోతే ప్రజ్వల్ తాను నటించిన పాత్రల కంటే కూడా ఇలా సినిమా ఈవెంట్లలో తన స్పీచ్ తో మరింత వైరల్ అవుతున్నారు. రాజా ప్రజ్వల్ మునుముందు మరిన్ని అవకాశాలు అందుకొని స్టార్ స్టేటస్ సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.