E-Paper
Advertisement

గేమ్ ఛేంజర్ అసలు స్టోరీ ఇదేనా..ఇన్నాళ్ళకు బయటపెట్టిన డైరెక్టర్ కార్తీక్!

గేమ్ ఛేంజర్ అసలు స్టోరీ ఇదేనా..ఇన్నాళ్ళకు బయటపెట్టిన డైరెక్టర్ కార్తీక్!
Advertisement

Karthik subbaraju:రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ శంకర్ (S.Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) చేసిన చిత్రం గేమ్ ఛేంజర్. భారీ అంచనాల మధ్య, హై బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా విమర్శల పాలయ్యింది. డైరెక్టర్ శంకర్ పై తీవ్రస్థాయిలో మెగా అభిమానులు మండిపడ్డారు. ట్రోల్స్ కూడా చేశారు.

గేమ్ ఛేంజర్ అసలు స్టోరీ ఏమిటంటే?

ముఖ్యంగా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఎన్నో కారణాలు తెరపైకి వచ్చాయి. శంకర్ ఏకంగా కథే మార్చేశాడు అనే మాట ఎక్కువగా వినిపించింది. ఇకపోతే ఈ సినిమాకి కథను తాను అందించాను అంటూ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ తర్వాత కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ..” అసలు నేను ఇచ్చిన కథ ఇది కాదు.. శంకర్ కథ మొత్తం మార్చేశారు” అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో రాంచరణ్ అభిమానులు శంకర్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇక ఈ సమస్య సద్దుమణిగింది అనుకునేలోపే మరోసారి కార్తీక్ సుబ్బరాజు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తాను శంకర్ కు ఇచ్చిన కథ ఇదే అంటూ ఆయన ఒక స్టోరీ చెప్పుకొచ్చారు.

నేను చెప్పిన కథ వేరే..

Advertisement

ఇటీవల డోరతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీక్ సుబ్బరాజు తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ పై స్పందించారు. కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ.. “నా దగ్గర ఒక స్టోరీ ఉంది. అది నేను శంకర్ గారికి ఇచ్చాను. ఆయన స్క్రీన్ ప్లే , డైలాగ్స్ కూడా రాయమన్నారు. కానీ నేను అప్పుడు మహాన్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల రాయడానికి కుదరలేదు. అయితే నేను ఇచ్చిన స్టోరీ “ఒక ఐఏఎస్ ఆఫీసర్.. వేరే ఆఫీసర్స్ తో కలిసి సమాజాన్ని మార్చడం” అనేది పాయింట్. హిందీలో “న్యూటన్” అనే ఒక సినిమా ఉంటుంది. ఒక ఎలక్షన్ ఆఫీసర్ గ్రామాలకు వెళ్లడం లాంటి సన్నివేశాలు దాదాపు కొంత భాగం అలాగే ఉంటుంది. కానీ రియాలిటీగా ఉంటుంది.

also read:ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రాజమౌళి కొడుకు మూవీ!

తమిళ బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్ స్టర్ కథ కూడా..

Advertisement

నేను రాసిన కథలో గ్యాంగ్ స్టర్ కథ కూడా ఉంది. అయితే నేను ఈ స్టోరీని తమిళ బ్యాక్ డ్రాప్ లో అందించాను . కానీ శంకర్ ఆ కథను పూర్తిగా మార్చేశారు. ఇకపోతే ఇక్కడ సంతోషం కరమైన విషయం ఏమిటంటే.. శంకర్ గారు నా కథను వాడుకున్నారు అని నేను హ్యాపీగా ఫీలయ్యాను” అంటూ తెలిపారు ..అయితే కార్తీక్ సుబ్బరాజు చేసిన ఈ కామెంట్లు శంకర్ పై మరోసారి విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి.

మరోసారి శంకర్ పై విమర్శలు..

ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్ అనే పాత్రలను తీసుకొని తండ్రి , కొడుకు కథ , రివెంజ్ స్టోరీ గా మార్చేశాడు శంకర్.. అసలు కార్తీక్ సుబ్బరాజు చెప్పిన కథలో సమాజాన్ని మార్చడం, ఎలక్షన్ ఆఫీసర్ గ్రామాలకు వెళ్లడం, గ్యాంగ్ స్టర్ ఇవేవీ కనిపించలేదు కదా అంటూ చెబుతున్నారు. ఒకవేళ కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన స్టోరీని తెరపైకి తీసుకొచ్చి ఉంటే హిట్ అయ్యేదేమో అని కూడా మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఏం ప్రయోజనం అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

వెంకటేష్ కొడుకుగా నటించిన ఈ బుడ్డోడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

చైనా రెస్టారెంట్ లో డ్యాన్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం?

శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన త్రివిక్రమ్.. ఏం జరుగుతోంది రా అయ్యా?

ఫౌజీ టీజర్ వివాదం.. కేంద్రమంత్రికి లేఖ!

ఈసారి బాక్సాఫీస్ దగ్గర సిక్సర్లు కొడతామంటున్న వెంకీ మామ!

సుధీర్ సింగిల్ లైఫ్‌పై సత్తి సెటైర్లు.. దివ్యభారతి ముందు పరువు తీసేశాడుగా!

దివ్య భారతి దగ్గర బిత్తిరి సత్తి అల్లరి.. సుధీర్ నవ్వులు ఆపుకోలేదుగా!

Big Stories

Advertisement
×