E-Paper
Advertisement

చైనా రెస్టారెంట్ లో డ్యాన్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం?

చైనా రెస్టారెంట్ లో డ్యాన్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం?
Advertisement

Kamakshi Bhaskarla:జీవితంలో అనుకున్నది సాధించాలి అంటే కొన్ని వదిలేసుకోవాల్సిందే.. ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్ హీరోయిన్ ఒకవైపు వైద్య వృత్తిని కొనసాగిస్తూనే.. మరొకవైపు తన కలను నెరవేర్చుకోవడానికి.. మిస్ ఇండియా అవడం కోసం రెస్టారెంట్ లో డాన్స్ చేస్తూ డబ్బును సంపాదించిందట. అంతేకాదు హీరోయిన్గా మారడం కోసం తన వైద్య వృత్తిని కూడా పక్కన పెట్టింది ఈ ముద్దుగుమ్మ. పైగా ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాలతో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ.. అందరి దృష్టిని ఆకర్షించింది ఈ తెలుగమ్మాయి. ఆమె ఎవరో కాదు కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla).

మిస్ ఇండియా అవడం వెనుక కామాక్షి కష్టం..

1995 జూన్ 18న ఆంధ్ర ప్రదేశ్ ఏలూరులో జన్మించిన ఈమె.. చైనాలో ఎంబిబిఎస్ పూర్తి చేసి అపోలో హాస్పిటల్స్ లో పనిచేసింది. అయితే నటన మీద ఆసక్తితో ఒకవైపు చదువుకుంటూనే మోడల్గా తన కెరీర్ను ప్రారంభించిన ఈమె… ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2018 టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొని ఫైనల్ కు చేరుకుంది.. 2021 లో జీవి రామరాజు దర్శకత్వం వహించిన ప్రియురాలు అనే చిత్రంతో తొలిసారి వెండితెరకు పరిచయమైన ఈమె.. పొలిమేర చిత్రంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత నటించిన మా ఊరి పొలిమేర 2 , 12 ఏ రైల్వే కాలనీ షో టైం వంటి చిత్రాలలో నటించిన కామాక్షి.. ఇటీవల నటించిన అగధ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది . ఇందులో మహాదేవి పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది.

డబ్బు కోసం రెస్టారెంట్ లో డాన్స్ కూడా చేశాను..

Advertisement

ప్రస్తుతం మా ఊరి పొలిమేర 3 చిత్రంలో నటిస్తున్న ఈమె మరోవైపు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను పంచుకుంటుంది. అందులో భాగంగానే తాను ఎంబిబిఎస్ చదువుతున్న సమయంలో మిస్ ఇండియా అవ్వాలనే కోరిక నెరవేర్చుకోవడానికి డబ్బు కావాలి.. అయితే ఆ డబ్బు సంపాదించడానికి ఏకంగా రెస్టారెంట్లో డాన్స్ చేశాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మా ఇంట్లో మిస్ ఇండియా పోటీల కోసం ట్రై చేస్తానన్నప్పుడు వద్దన్నారు. చైనాలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పుడు నేను మా అమ్మకు చెప్పాను. మిస్ ఇండియా పోటీలలో పాల్గొనడానికి ఇండియా వద్దాం అనుకుంటున్నాను అని..

also read:శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన త్రివిక్రమ్.. ఏం జరుగుతోంది రా అయ్యా?

నాన్న డబ్బు ఇవ్వకపోవడం వల్లే ఆ కష్టాలన్నీ..

Advertisement

అయితే నా అసలు ప్లాన్ ఏమిటంటే.. చైనాలోనే ఉండి పీజీ చేసుకుందామనుకున్నాను. ఎందుకంటే టాప్ టెన్ టాపర్స్ కి అక్కడ ఫ్రీ సీట్ ఉంటుంది. నేను ఎలాగో టాపర్ ని కాబట్టి.. అందుకే పార్టిసిపేట్ చేసి మళ్లీ చైనాకు వెళ్ళిపోతానని చెప్పాను. అయితే మిస్ ఇండియా పోటీలలో పాల్గొనడానికి ఎంట్రీ ఫీజు చాలా ఖరీదైనది. దానికి మా నాన్న ఒప్పుకోలేదు. పైగా ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పేసారు. దీంతో చేసేదేమీ లేక నేనే సొంతంగా డబ్బు సంపాదించాలని అనుకున్నాను. అయితే మిస్ ఇండియా పోటీలలో పాల్గొనడానికి నేను ఎంత హార్డ్ వర్క్ చేశానంటే.. ఉదయం 6 గంటలకు హాస్పిటల్లో డ్యూటీకి వెళ్లే దాన్ని. మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్ ఉండదు. మధ్యలో 10 మినిట్స్ రౌండ్స్ తర్వాత మరో 10 మినిట్స్ తినడానికి ఇచ్చేవాళ్ళు.

ఏడాది పాటు రోజుకు ఐదు గంటలే నిద్రపోయాను..

ఇక 12 గంటలకు డ్యూటీ దిగాక నా ఎలక్ట్రిక్ స్కూటీని ఉపయోగించుకొని.. రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ పార్ట్ టైం డాన్సర్ గా పని చేసేదాన్ని. చైనాలో ఇండియన్ డాన్స్ అంటే చాలా ఇష్టం. 12:30 నుంచి 2:00 వరకు నాలుగు పర్ఫామెన్స్ లు ఇచ్చేదాన్ని. ఆ తర్వాత వాళ్ళు ఫ్రీగా భోజనం పెట్టేవాళ్ళు. తర్వాత మళ్లీ 2:30 కు హాస్పిటల్ కు వచ్చేదాన్ని. మళ్లీ రాత్రి 8 గంటల వరకు హాస్పిటల్లో పనిచేసేదాన్ని. మళ్లీ 8 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు నాలుగు పర్ఫామెన్స్ లు ఇచ్చి, అక్కడ ఫ్రీ భోజనం పెడితే దాన్ని తిని, హాస్పిటల్ కి వచ్చేదాన్ని . ఒక్కోసారి రాత్రి షిఫ్ట్ కూడా ఉండేది. ఎంతో కష్టపడ్డాను. రోజుకు ఐదు గంటలు పాటు నిద్రపోతూ.. దాదాపు ఏడాది పాటు చాలా కష్టపడ్డాను. అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి. మొత్తానికైతే ఆమె పడ్డ కష్టం ఎందరికో స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.

Related News

వెంకటేష్ కొడుకుగా నటించిన ఈ బుడ్డోడి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన త్రివిక్రమ్.. ఏం జరుగుతోంది రా అయ్యా?

ఫౌజీ టీజర్ వివాదం.. కేంద్రమంత్రికి లేఖ!

ఈసారి బాక్సాఫీస్ దగ్గర సిక్సర్లు కొడతామంటున్న వెంకీ మామ!

సుధీర్ సింగిల్ లైఫ్‌పై సత్తి సెటైర్లు.. దివ్యభారతి ముందు పరువు తీసేశాడుగా!

దివ్య భారతి దగ్గర బిత్తిరి సత్తి అల్లరి.. సుధీర్ నవ్వులు ఆపుకోలేదుగా!

హోమ్లీగా కనిపిస్తూనే గ్లామర్‌తోనూ మెప్పించనుందా.. పవర్ పేటలో రితికా!

Big Stories

Advertisement
×