Qatar Airways: కొందరు నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతుంటాయి. ఖతార్ ఎయిర్‌వేస్‌లో సిబ్బంది నిర్లక్ష్యం ఓ ప్రయాణికుడు ప్రాణాలను కోల్పోయాడు. ఆయన ఆర్డర్ చేసుకున్న ఆహారం కాకుండా మరొకటి ఇచ్చారు. భోజనం తినే ప్రయత్నంలో ఆహారం గొంతులో ఇరుక్కుని ఈలోకాన్ని విడిచిపెట్టాడు. ఈ ఘటనపై మృతుడి ఫ్యామిలీ సదరు ఎయిర్‌లైన్స్‌పై దావా వేసింది. అసలు మేటరేంటి?
విమానంలో స్టోరీ ఏంటి?
కాలిఫోర్నియాకు చెందిన 85 ఏళ్ల కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక జయవీర. రెండేళ్ల కిందట అంటే 2023 జూన్ 30న ఆయన కాలిఫోర్నియా నుంచి శ్రీలంకకు బయలుదేశారు. ఆయన పూర్తిగా శాకాహారి ఆ తరహా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. విమానంలో భోజనం వడ్డించే సమయంలో సిబ్బంది ఆయనకు వెజ్ అందుబాటులో లేదని తెలియజేశారు. దానికి బదులుగా నాన్ వెజ్ ఉందని చెప్పి ఇచ్చారు.
తాను వృద్ధుడ్ని, 15 గంటలకు పైగా ట్రావెల్ చేయాలంటే కష్టమని చెప్పారు. మాంసం ముక్కలను పక్కన పెట్టి మిగతా ఫుడ్ తినమని సలహా ఇచ్చారు. సిబ్బంది చెప్పినట్లే చేశారు. ఫలితంగా తీసుకున్న ఆహారం ఆయన గొంతులో అడ్డుపడి శ్వాస ఆడలేదు. చివరకు స్పృహ కోల్పోయి సీటులో ఉండిపోయారు. వెంటనే విమాన సిబ్బంది స్పందించి మెడ్ ఎయిర్ వైద్యుల సూచనలతో ప్రథమ చికిత్స అందించారు.
వెజ్‌కు నాన్ వెజ్ ఇచ్చిన సిబ్బంది
అప్పటికీ ఫలితం లేకపోయింది. డాక్టర్ పరిస్థితి విషమించడంతో విమానాన్ని అత్యవసరంగా స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ 2023 ఆగస్టు 3న మరణించారు డాక్టర్ అశోక జయవీర. శ్వాసనాళంలోకి ఆహారం వెళ్లడం వల్ల ఆయన మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తేల్చారు.
ఈ విషయం తెలిసి డాక్టర్ అశోక జయవీర కుటుంబసభ్యులు షాకయ్యారు. ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ఖతార్ ఎయిర్‌వేస్‌పై రాంగ్‌ఫుల్ డెత్ పేరిట న్యాయస్థానంలో కేసు వేశారు. భోజనం విషయంలో సిబ్బంది తీరు, వైద్య సహాయం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించింది. దాదాపు మూడున్నర గంటలు అపస్మారక స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
ALSO READ: వందే భారత్ తయారీలో ఇంత పెద్ద తప్పు జరిగిందా?
అంతర్జాతీయ రూల్స్ మేరకు వెళ్తున్న విమానంలో ప్రయాణికులకు జరిగే నష్టానికి సంబంధిత విమాన సంస్థలు బాధ్యత వహించాలి. విమానాల్లో ప్రయాణికుల ఆహారం పట్ల ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గతంలో ఖతార్ ఎయిర్‌లైన్‌లో అలర్జీ ఉన్న ఓ ప్రయాణికుడికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆ తర్వాత అది వివాదానికి దారి తీసిన విషయం తెల్సిందే.