BigTV English

Theater Movies : రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి పైనే ఫోకస్..

Theater Movies : రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి పైనే ఫోకస్..

Theater Movies : ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు థియేటర్లలోకి వస్తూ ఉంటాయి. అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈనెల దసరా సందర్భంగా థియేటర్లలోకి రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈనెల మంచి బోనీ కొట్టింది. ఇక ఈ వారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. అయితే పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో జనాలు కూడా ఎక్కువగా పట్టించుకోవడం లేదు.. అన్ని చిన్న సినిమాలే కావడంతో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. మరి ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..


ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

ప్రతి శుక్రవారం థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అన్న విషయం తెలిసిందే.. ఓజీ, కాంతార 1 ప్రభంజనాన్ని ముందే పసిగట్టిన నిర్మాతలు దానికి అనుగుణంగా పెద్ద సినిమాలను లైన్ లో పెట్టలేదు.. ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఇవే..

‘కానిస్టేబుల్’.. 

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన చిత్రం కానిస్టేబుల్.. ఎప్పుడు మొదలయ్యిందో ఎప్పుడు పూర్తయ్యిందో కానీ అక్టోబర్ 10 ప్రేక్షకులను పలకరించనుంది. క్రైమ్, కామెడీ, థ్రిల్ అన్నీ మిక్స్ చేశారు కానీ హీరో ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తేనే ఉంటుంది లేదంటే థియేటర్లో నుంచి వెళ్ళిపోతుంది.. మరి ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకుంటుందేమో రేపు చూడాలి..


‘శశివదనే’.. 

టాలీవుడ్ యువ న‌టుడు రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ‘శశివదనే’ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.. ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ సీన్స్ ఈ మూవీ రాబోతుంది. ఇందులో కోమలి ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేపు థియేటర్లలోకి వచ్చేసిన తర్వాత ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి..

‘అరి ‘..

సైకలాజికల్ థ్రిల్లర్ ‘అరి’ ఇదే రోజు రానుంది. క్యాస్టింగ్ కాస్త ప్రామిసింగ్ గానే ఉంది. సాయికుమార్, అనసూయ, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష లాంటి నోటెడ్ ఆర్టిస్టులు చాలానే ఉన్నారు. ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి.. ఈ మూవీ నుంచి నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దేవుడి స్టోరీ తో రాబోతున్న సినిమాలు ఈమధ్య పాజిటివ్ టాక్ ని అందుకుంటున్నాయి. మరి ఏ మూవీ ఎలాంటి సక్సెస్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Also Read : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె? ఆ వీడియోనే కారణమా?

ఈ వారం సినిమాలు తప్ప పెద్దగా చెప్పుకునే సినిమాలు అయితే రాలేదు.. అక్టోబర్ 17 మళ్ళీ యూత్ ఫుల్ మూవీస్ రాబోతున్న నేపథ్యంలో బయ్యర్ వర్గాలను కొత్త సినిమాలు ఏమైనా మెప్పిస్తాయో చూడాలి.. ఇకపోతే థియేటర్లలోకి మాత్రమే కాదు. అటు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు వస్తున్నాయి. మొత్తానికి ఈ వారం మూవీ లవర్స్ కి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి..

Related News

Akkineni Nagarjuna: నాగ్ మావా.. టబుతో మళ్లీ రొమాన్సా.. మన్మథుడివే

Trivikram – Venky : తమన్‌కు గురూజీ టాటా బై బై.. ఇక యాంగ్రీ యానిమల్‌‌ను చూస్తారు

Sobhita Akkineni: చీకట్లో అక్కినేని కోడలు.. భయపెడుతుందా

Peddi Movie: షాకింగ్‌.. పెద్ది షూటింగ్‌ క్యాన్సిల్‌!

Dude Trailer: సరికొత్తగా డ్యూడ్ ట్రైలర్.. ఎలా ఉందంటే?

Siva Raj Kumar : తొక్కిసలాటపై శివన్న రియాక్షన్… విజయ్ ఆలోచించాల్సింది అంటూ

Spirit Movie : డార్లింగ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. బర్త్ సర్ ప్రైజ్ లోడింగ్..

Big Stories

×