BigTV English

Nazriya Nazim: ఫహాద్ తో విడాకుల రూమర్స్.. ఆ హీరోతో నజ్రియా రొమాన్స్

Nazriya Nazim: ఫహాద్ తో విడాకుల రూమర్స్.. ఆ హీరోతో  నజ్రియా రొమాన్స్
Nazriya Nazim: మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి  స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత కూడా ఆమె ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో అంటే సుందరానికి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేనప్పటికీ నజ్రియా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 
గతేడాది సూక్షదర్శిని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటి అవార్డుకు కూడా  ఎంపికైంది. అయితే గత కొంత కాలంగా నజ్రియా  సోషల్ మీడియాకు, బంధువులకు దూరంగా ఉంటానని ఆమె చెప్పడం అందరిని షాక్ లోకి తీసుకెళ్లింది. ఆమె సోషల్ మీడియాకు దూరం కావడంతో ఫహద్‌తో వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయనే పుకార్లు వచ్చాయి. వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళింది అని, త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
అయితే ఇటీవల వారిద్దరూ కలిసి కార్యక్రమాల్లో పాల్గొని ఆ పుకార్లను ఖండించారు. తామిద్దరం కలిసే ఉంటున్నామని చెప్పకనే చెప్పుకొచ్చారు. దీంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇప్పుడిప్పుడే  నజ్రియా తన ఆరోగ్యాన్ని సెట్ చేసుకొని మళ్లీ సినిమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే అమ్మడి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. నజ్రియా నజీమ్ నటించిన ది మద్రాస్ మిస్టరీ: ఫాల్ ఆఫ్ ఏ సూపర్ స్టార్ సిరీస్ రిలీజ్ కు సిద్ధమైంది. 1940 నాటి స్కాండల్‌తో కూడిన పీరియడ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ కు సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ సిరీస్  సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
సిరీస్ కాకుండా నజ్రియా తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటిస్తున్న కొత్త చిత్రం ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ముహ్సిన్ పరారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏవీఏ సంస్థ నిర్మించబోతోంది. ఇదొక అద్భుతమైన ప్రేమ కథగా తెరకెక్కబోతుందని సమాచారం. పెళ్లి తరువాత ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే మొగ్గు చూపిన నజ్రియా చాలా గ్యాప్ తరువాత మొదటిసరి టోవినోతో ఒక లవ్ స్టోరీ చేయబోతుంది. ఇందులో మంచి రొమాన్స్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నజ్రియా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో  చూడాలి.


Related News

Bandla Ganesh: అవును… బండ్లన్న కామెంట్స్‌లో తప్పేముంది ?

Bandla Ganesh: బన్నీవాసు దెబ్బకు దిగొచ్చిన బండ్లన్న… ఆయన దేవుడు అంటూ ట్వీట్

Ameesha Patel: పెళ్లి తరువాత అది వద్దంటున్నారు.. అందుకే నేను చేసుకోవడం లేదు

Nag Ashwin : కర్మను ఎవరు తప్పించుకోలేరు.. దీపికాకు డైరెక్టర్ కౌంటర్!

Manchu Manoj: మిరాయ్ ఎఫెక్ట్.. చిరుకు విలన్ గా మంచు మనోజ్ ..?

RK Roja: మరో అరుదైన అవార్డు అందుకున్న రోజా సెల్వమని కూతురు!

Sharwanand: షాకింగ్.. శర్వానంద్ విడాకులు.. ?

Big Stories

×