Rose Water For Skin: ముఖం తెల్లగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో రోజ్ వాటర్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ చర్మాన్ని తెల్లగా మెరిసేలా చేస్తుంది. మరి ముఖ సౌందర్యం పెరగడానికి రోజ్ వాటర్ ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1.రోజ్ వాటర్, కలబంద జెల్:
జిడ్డు చర్మం ఉన్నవారికి కలబంద జెల్ సహజ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇందులో మొటిమలను నివారించే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. మీరు ఒక చెంచా తాజా కలబంద జెల్‌ను రోజ్ వాటర్‌తో కలిపి ప్రతి రోజూ ఉదయం మీ ముఖంపై అప్లై చేయాలి. తర్వాత 10 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై సాధారణ నీటితో శుభ్రం చేయండి.
ఇది చర్మం నుంచి అదనపు నూనెను తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని చల్లబరుస్తుంది. ఫలితంగా ముఖం రోజంతా తాజాగా కనిపిస్తుంది. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా ఈజీగా తొలగిపోతాయి.
2. రోజ్ వాటర్, నిమ్మరసం:
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మం నుండి నూనె , మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఒక టీస్పూన్ రోజ్ వాటర్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి దూది సహాయంతో ముఖానికి అప్లై చేయండి. ముఖ్యంగా ఉదయం పూట ఈ టిప్స్ పాటించడం వల్ల, రోజంతా తాజాగా ఉంటారు. అంతే కాకుండా మీ చర్మం శుభ్రంగా ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో నిమ్మరసం ఎక్కువగా వాడకూడదని గుర్తుంచుకోండి. లేకపోతే చర్మం పొడిగా లేదా చికాకుగా మారవచ్చు.
3. రోజ్ వాటర్, ముల్తానీ మిట్టి:
ప్రతిరోజు ఉదయం మీకు కొంత సమయం దొరికితే.. ముల్తానీ మిట్టి , రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేసుకుని ఫేస్ ప్యాక్ లా వాడండి. ఇది చర్మం నుండి మురికి, నూనె, చెమట వాసనను తొలగిస్తుంది. ఇది చర్మ రంధ్రాలను బిగించి మృదువుగా చేస్తుంది. ఈ పేస్ట్ ను ముఖం మీద 10-15 నిమిషాలు అప్లై చేసి.. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేయండి. వారానికి 2-3 సార్లు దీనిని వాడటం వల్ల చర్మంపై సహజమైన మెరుపు వస్తుంది.
Also Read: ఈ ఫేస్ స్క్రబ్ వాడితే.. ముఖంపై జిడ్డు మాయం
రోజ్ వాటర్ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు:
రోజ్ వాటర్ చర్మానికి ఒక అద్భుతమైన, సహజసిద్ధమైన క్లెన్సర్. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఎరుపుదనాన్ని, మంటను తగ్గిస్తాయి. ఇది చర్మాన్ని టొనింగ్ చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖ రంధ్రాలను బిగుతుగా చేసి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. రోజ్ వాటర్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నష్టం నుండి రక్షిస్తాయి.
ఇది చర్మం యొక్క pH సమతుల్యతను కాపాడుతుంది. అంతే కాకుండా మొటిమలు, బ్లాక్‌హెడ్స్ రాకుండా నివారిస్తుంది. పొడి చర్మానికి తేమను అందించి, మృదువుగా చేస్తుంది. మేకప్ తొలగించడానికి సున్నితమైన క్లెన్సర్‌గా కూడా రోజ్ వాటర్‌ను ఉపయోగించవచ్చు. రోజూ వాడటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.