Hari Hara Veeramallu: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు అని ఈ సినిమా గురించి మొదట అనౌన్స్మెంట్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ తో పాటు ఈ సినిమా నుంచి మొదట వీడియో రిలీజ్ అయినప్పుడు అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.
పవన్ కళ్యాణ్ లో ఆడియన్స్ ఇష్టపడే స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసి రిలీజ్ చేశాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు అంటే రికార్డులు తిరగ రాస్తారు అని అందరికీ ఒక విపరీతమైన క్లారిటీ వచ్చేసింది. కానీ ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాకుండా పోయింది.
ట్రస్ట్ ది ప్రాసెస్
ఈ సినిమాకి నిర్మాతగా ఏఎం రత్నం వ్యవహరిస్తున్నారు. ఏం రత్నం కి మరియు పవన్ కళ్యాణ్ కి ఎంత మంచి బాండింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. వీరి కాంబినేషన్లో ఇప్పటికే ఖుషి, బంగారం వంటి సినిమాలు వచ్చాయి. అలానే సత్యాగ్రహి అనే సినిమా మొదలై ఆగిపోయింది కూడా. మొత్తానికి వీరిద్దరూ కలిసి హరిహర వీరమల్లు సినిమాతో మళ్లీ కలిసారు.
అయితే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒకప్పుడు బీభత్సమైన హడావిడి ఉండేది. ఒక పండుగ వాతావరణంలో నెలకొనేది. కానీ ఈ సినిమాకి సంబంధించి అసలు వైబ్ లేకుండా పోయింది. నిర్మాత ఏఎం రత్నం ను అడిగితే ప్రస్తుత ప్రాసెస్ అంటున్నారు. ఈ ప్రాసెస్ లో కూడా సినిమాలో నటించిన ప్రముఖ నటీనటులు కూడా ప్రమోషన్స్ కి రావట్లేదు. కేవలం నిర్మాత ఏం రత్నం, హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రమే సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
TRUST THE PROCESS pic.twitter.com/NnX24Dm4IZ
— Twood Trolls ™ (@TwoodTrolls_2_0) July 18, 2025
ట్రస్ట్ పోయింది అనేది నిజం
వాస్తవానికి హరిహర వీరమల్లు అనే సినిమా ఎప్పుడు రిలీజ్ కావలసి ఉంది. కానీ ఈ సినిమా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బయటకు వెళ్లిపోవడం. జ్యోతి కృష్ణ ఈ ప్రాజెక్టులోకి ఇన్వాల్వ్ అవ్వడం. ఇలాంటి కారణాలు సినిమా మీద ట్రస్ట్ పోయేటట్టు చేశాయి. ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లో రిలీజ్ కానుంది. బాబీ డియోల్ ఎక్కడా..? నర్గీస్ ఫక్రీ ఎక్కడా ? తనికెళ్ల భరిణి, అనసూయ, అనుపమ్ ఖేర్, సునీల్, వీళ్లు ఎవ్వరూ కనిపించడం లేదు. కనీసం సోషల్ మీడియాలో అయినా.. ప్రమోట్ చేసినట్టు తెలియడం లేదు.
అనకూడదు కానీ ఇప్పటికీ చాలామందికి ఈ సినిమా 24 న వస్తుందో లేదో డౌట్. పవన్ కళ్యాణ్ సినిమాకి పెద్దగా ప్రమోషన్ అవసరం లేకపోయినా కూడా ఈ సినిమాకి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పటివరకు కాలేదు. ఏదేమైనా సినిమా మంచి టాక్ సంపాదించుకుంది అంటే రిజల్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఏం రత్నం కూడా ఇటువంటి పరిస్థితులను దాటుకొని వచ్చి ఉన్నారు. ఆయనకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది.
Also Read: Am Ratnam: మీరు కోట్లు కుమ్మరించారు కదా అని, ప్రేక్షకుడిని బలి చేస్తారా నిర్మాత గారు?