సాధారణంగా సరస్సులు, నదులలో అనకొండలు కనిపిస్తుంటాయి. జలాల్లోని చేపలు, ఇతర జీవులను తిని బతికేస్తుంటాయి. డాల్ఫిన్స్ ను కూడా లాగించేస్తాయి. కానీ, తాజాగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో పరిశోధకులు అరుదైన దృశ్యాన్ని గమనించారు. పింక్ రివర్ జాతికి చెందిన డాల్ఫిన్ ల సమూహం ఆసాధారణ ఫ్రెండ్ తో ఆటలాడుతూ కనిపించాయి. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరో కాదు భారీ అనకొండ.
అనకొండతో డాల్ఫిన్ల ఆటలు
ఆగస్టు 2021లో బొలీవియాలోని నోయెల్ కెంఫ్ మెర్కాడో మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ నిపుణులు ఈ దృశ్యాన్ని గుర్తించారు. బొలీవియాలోని టిజముచి నదిలో బోటోస్ అని పిలువబడే అమెజాన్ రివర్ డాల్ఫిన్ ల గుంపు పెద్ద అనకొండతో ఆడుతూ కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసి వాళ్లంతా షాకయ్యారు. తాజాగా ఈ విషయాన్నిఎకాలజీ జర్నల్ లో ప్రచురించారు. డాల్ఫిన్ ల ఆసక్తి, అవి ఆడుకునే విధానాన్ని ఇందులో ప్రస్తావించారు. ఈ వింతైన అనుభవం వారిని ఆశ్చర్యానికి గురి చేసినట్లు వెల్లడించారు. ఈ పరిశోధనలు జీవశాస్త్రవేత్తలకు ఒక వరం అయినప్పటికీ, నీటి ఉపరితలం క్రింద వాస్తవానికి ఏమి జరుగుతుందో అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.
అనకొండ- డాల్ఫిన్స్ ఆటలను షూట్ చేసిన స్టెఫెన్ రీచ్లే
జీవశాస్త్రవేత్త, పరిశోధన బృంద సభ్యుడు స్టెఫెన్ రీచ్లే ఈ అరుదైన దృశ్యాన్ని తన వీడియోలో చిత్రీకరించారు. నీటి పైన కొట్లాడే దృశ్యాలు చూసి సంభ్రమాశ్చర్యానికి గురైనట్లు తెలిపారు. అమెజాన్ నదిలో డాల్ఫిన్లు సాధారణంగా అప్రమత్తంగా ఉంటాయి. ఇతరులకు అస్పష్టంగా కనిపిస్తాయి. అవి సాధారణంగా రోజులో ఎక్కువ భాగం అమెజాన్ బేసిన్ మురికి నీటి కింద దాక్కుంటాయి. అయితే, వారు చూసిన సందర్భంలో నీటి పైన ఆడుతూ కనిపించాయి. వాటిని దగ్గరగా పరిశీలించినప్పుడు డాల్ఫిన్లు శ్వాస తీసుకోవడానికి ఉపరితలంపైకి రావడం లేదు. అవి ఒక పెద్ద అనకొండతో ఆడుకునేందుక పైకి వచ్చినట్లు గుర్తించారు.
Read Also: ఒకే యువతిని పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు.. ఆ ఊరిలో ఇదే సాంప్రదాయమట!
ఆ అనకొండ బతికే ఉందా?
డాల్ఫిన్లు కనిపిస్తేనే దాడి చేసి ఆహారంగా మార్చుకునే అనకొండ, వాటితో ఆటలాడటం ఆశ్చర్యం కలిగించినట్లు పరిశోధకుల బృందం వెల్లడించింది. డాల్ఫిన్లు అనకొండను నోటిలో పట్టుకుని, నీళ్లలో ఈదుతున్నట్లు కనిపించాయి. జాతి వైరాన్ని మరిచి ఆటలాడుతున్నాయి. పరిశోధకులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా కనిపిస్తాయని బ్రెజిల్ లోని యూనివర్సిడేడ్ ఫెడరల్ డో రియో గ్రాండే డో సుల్ లో వర్గీకరణ శాస్త్రవేత్త ఒమర్ ఎంటియాస్పే-నెటో వెల్లడించారు. డాల్ఫిన్లు అత్యంత చురుకుగా అనకొండతో ఆడుతున్నట్లు తెలిపారు. అదే సమయంలో అనకొండ గురించి పలువురు శాస్త్రవేత్తలు సందేహాలు వ్యక్తం చేశారు. డాల్ఫిన్లు దానితో ఆడుకునే సమయానికి అనకొండ చనిపోయిందా? లేదంటే గాయపడిందా? అని ప్రశ్నించారు. ఈ ఘటన నిజానికి అత్యంత అసాధారణంగా అనిపిస్తుందన్నారు. ఈ ఘటనపై పూర్తి పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: అమ్మమ్మకు మనువడి ఊహించని బహుమతి, ఎవరూ ఇలా ఇచ్చి ఉండరు!