BigTV English
Advertisement

DNA Movie: థియేటర్లో విడుదలైన మరుసటి రోజే ఓటీటీకి వచ్చిన క్రైం థ్రిల్లర్.. ఇదేం ట్విస్ట్ రా బాబూ!

DNA Movie: థియేటర్లో విడుదలైన మరుసటి రోజే ఓటీటీకి వచ్చిన క్రైం థ్రిల్లర్.. ఇదేం ట్విస్ట్ రా బాబూ!


DNA OTT Release: సర్ప్రైజ్.. థియేటర్ లో విడదలైన మరుసటి రోజే ఓ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ నటుడు అధర్వ మురళీ, నిమిషా సజయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం డీఎన్ఏ (DNA Movie). కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్ ఈ చిత్రం తమిళంలో తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న తమిళ భాషలో విడుదలైంది. థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.


నిన్న థియేటర్ల రిలీజ్.. నేడు ఓటీటీలో స్ట్రీమింగ్..

దీంతో ఈ సినిమా నెల రోజుల ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ ఇచ్చారు. నేడు (జూలై 19) డీఎన్ఏ ప్రముఖ ఓటీటీ సంస్థ జీయో హాట్ స్టార్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. తమిళ భాషలోనే కాదు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా తెలుగులో థియేటర్లలో విడుదలైన నెక్ట్స్ డే నే ఓటీటీలోకి రావడం తెలుగు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తోంది. కాగా ఈ సినిమాను తెలుగులో బేబీ సినిమాతో విడుదల చేశారు. నిన్నే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ మరుసటి రోజే ఓటీటీ రావడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. ఒలంపియా మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు గిబ్బర్ వైబోధ సంగీతం అందించగా.. సత్యప్రకాశ్, శ్రీకాంత్ హరిహరన్, ప్రవీన్ సైవీ తదితరులు పాడారు.

డీఎన్ఏ కథ విషయానికి వస్తే

ఆనంద్ (హీరో ఆధర్వ) ప్రేమలో విఫలమై తాగుడుకు బానిసైన యువకుడి పాత్రలో కనిపించాడు. తరచూ తాగుతున్న కొడుకుతో ఆనంద్ తండ్రి అసహనం చూపిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. దీంతో ఆనంద్ రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు సూచిస్తారు. వారి బలవంతం మేరకు రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళతాడు. అక్కడ ఆనంద్ కు దివ్య (నిమిషా సజయన్) పరిచయం అవుతుంది. దివ్య హైపర్ యాక్టివ్ అనే మానసిక సమస్యతో అక్కడ చేరుతుంది. ఈ సమస్య ఉందని తెలిసిన ఆనంద్, దివ్యను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరికి బిడ్డ పడుతుంది. అయితే బిడ్డ ఆరోగ్యం బాగలేదని, బాబుని ఇంక్యూబేటర్ లో పట్టాలని తీసుకువెళ్లి.. మరికొద్దిసేపటికే తీసుకువస్తారు.

ఆ బిడ్డను దివ్య చేతుల్లో పెట్టగానే ఆమె షాక్ అవుతుంది. ఈ బిడ్డ తన బిడ్డ కాదని చెబుతుంది. ఆమె మానసిక పరిస్థితి కారణంగా ఎవరూ దివ్య మాటలను పట్టించుకోరు. ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ, దివ్య మాత్రం ఈ బిడ్డ తనది కాదని కుటుంబ సభ్యులకు చెబుతుంది. భార్య మాటలతో ఆనంద్ కు అనుమాన పడతాడు. బాబుకు డీఎన్ఏ టెస్ట్ చేయించగా.. అది వారి బిడ్డ కాదని వెల్లడవుతుంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ బిడ్డ దొరికాడా? పిల్లల మాయం వెనుక ఎవరు ఉన్నారు? పోలీసులను కాదని, ఆనంద్ స్వయంగా రంగంలోకి ఎందుకు దిగాడు? అని తెలియాలంటే మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

Also Read: Sid Sriram: నలుగురు బాడీగార్డ్స్.. నీకు అవసరమా సిద్ధూ.. చుక్కలు చూస్తోన్న నిర్మాతలు..

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×