Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఈ పేరు చెబితే చాలు ఆడియన్స్ లో పూనకాలు వచ్చేస్తాయి. ఇక అలాంటిది ఆయన సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా అభిమానులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్న చిత్రాలలో హరిహర వీరమల్లు (Harihara Veera mallu) కూడా ఒకటి. ఇప్పటికే ఏకంగా 14 సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల ఉంది అంటే అగ్ర హీరోలు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకునే రోజులు ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక ఓటీటీ సంస్థ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీని డిసైడ్ చేసే రోజులు వచ్చాయంటే.. పవన్ కళ్యాణ్ క్రేజ్ ను మేకర్స్ ఏ రేంజ్ లో తగ్గించారో అర్థం చేసుకోవచ్చని అభిమానులు కూడా చిత్ర బృందంపై మండిపడుతున్నారు.
విడుదల తేదీ పై వీడని మిస్టరీ..
అసలు విషయంలోకి వెళ్తే రత్నం ప్రొడక్షన్ సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal)హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 12న విడుదల చేస్తామని, ఆ రోజు పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ అని కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. చివరికి మళ్ళీ వాయిదా వేశారు. ఇక జూన్ నెల పూర్తి కావస్తున్నా.. ఇంకా కొత్త తేదీ ప్రకటించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం జూలైలో అయినా విడుదలవుతుందా? అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు జూన్ 19వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారు అంటూ వార్తలు వినిపించాయి. చివరికి అది కూడా జరగలేదు. దీంతో నిర్మాణ సంస్థను ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు అభిమానులు.
నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమా?
ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం వల్లే సినిమా లేట్ అయిందని అనుకున్నాము. కానీ మీ నిర్లక్ష్యం వల్లే సినిమా లేట్ అవుతుందని ఇప్పుడు స్పష్టం అవుతోంది అంటూ చిత్ర బృందంపై మండిపడుతున్నారు. అంతేకాదు సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ త్వరగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే మేకర్స్ చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడుతోంది అని తెలిసి అభిమానులు ఒక రేంజ్ లో మండిపడుతున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. హరిహర వీరమల్లు సినిమాను విడుదలకు ఉంచిన పవన్ కళ్యాణ్.. మరొకవైపు ‘ ఓజీ’ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. అంతేకాదు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమయ్యింది. ఇక ఇందులో ప్రముఖ హీరోయిన్ శ్రీ లీల (Sree Leela) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తారా? లేక రాజకీయాలకే పరిమితమవుతారా ? అన్నది తెలియాల్సి ఉంది. కానీ మధ్యలో సురేందర్ రెడ్డి సినిమా కూడా తెరపైకి రావడం గమనార్హం. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎటువైపో చూడాలి.
ALSO READ:Star Director: కమెడియన్ మూవీపై పడ్డ స్టార్ డైరెక్టర్.. రీమేక్ తప్ప మరో దిక్కు లేదా?