Yogandhra 2025: విశాఖలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగనుంది. ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. మోడీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా యోగా చేస్తారు. 5 లక్షల మందితో విశాఖ బీచ్ రోడ్ తో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో యోగా డే జరుపుతున్నారు. 62 కోట్ల రూపాయల ఖర్చుతో పెద్ద ఎత్తున యోగాంధ్రను నిర్వహిస్తున్నారు. ప్రపంచ రికార్డ్ సృష్టిచేలా సాగరతీరంలో 5 లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు రంగం సిద్ధమయింది.
విశాఖ ఆర్కేబీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు తీరం వెంబడి యోగాసనాలు వేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బీచ్ రోడ్‌లో 326 కంపార్ట్‌మెంట్లను సిద్ధం చేసింది. ప్రతి 40 అడుగులకో చిన్న వేదికను ఏర్పాటుచేసింది. దీంతో ఇవాళ్టి నుంచే బీచ్ రోడ్‌లో వాహనాల రాకపోకలు నిలిపేశారు. రేపు వర్షం కురిస్తే ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేశారు. విశాఖ తీరంలో 11 యుద్ధ నౌకలను నిలిపి వాటిపై తూర్పు నౌకాదళం యోగా దినోత్సవం నిర్వహించనుంది. ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు ఇంచార్జ్‌గా డిప్యూటీ కలెక్టర్ వ్యవహరిస్తారు. 34 కిలోమీటర్ల దారి పొడవునా యోగ సాధన జరగనుంది. ఇందు కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వారికి క్యూఆర్ కోడ్ స్కాన్ వస్తుంది.
3 వేల మరుగుదొడ్లు, ప్రతి ఐదు కంపార్ట్‌మెంట్‌లకు ఒక వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వద్ద పది పడకల తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. ఏయూ మైదానంలో 10 పడకల ఆసుపత్రి కూడా నిర్మించడం జరిగింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో 20 వేల మంది గిరిజన విద్యార్థులతో యోగా కార్యక్రమం జరగనుంది. వర్షం పడితే ఇబ్బంది పడకుండా.. కార్యక్రమాన్నిజరిపేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు.
మొత్తం 10 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. రెండు వేల సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు 26 మంది యోగా గురువులు పర్యవేక్షించనున్నారు. మొత్తం 1500 మంది శిక్షకుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో మొత్తం 11 యుద్ధ నౌకలలో యోగా సాధన జరపుతున్నారు. ప్రతిఒక్కరికీ యోగా మ్యాట్, టీ షర్ట్స్ ఉచితంగా అందిస్తారు. 3వేల తాత్కాలిక మరుగుదొడ్లు సిద్ధం చేశారు. యోగాంధ్రకు వచ్చే ప్రజలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. 3,600 ఆర్టీసీ సహా 7,295 ప్రైవేటు బస్సుల ద్వారా ప్రజలను తరలించారు. ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా విశాఖలో పోలీసుల ట్రయల్ రన్ నిర్వహించారు. ఐఎన్‌ఎస్ డేగ నుంచి కమాండ్ గెస్ట్ హౌస్ వరకు ట్రయల్ రన్ చేశారు.తరలిస్తారు.
Also Read: ట్రయాంగిల్ వాటర్ వార్..? బనకచర్ల వివాదం ఏంటంటే..! తెలంగాణ వాటా ఎంతంటే..?
యోగాతో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి నారాయణ. ప్రధాని మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. యోగా కార్యక్రమం కోసం శానిటేషన్ సిబ్బందిని బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. బీచ్ వెంబడి 2వేల సీసీ కెమెరాలు, పది వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 6300 మంది వాలంటీర్లను ఈ కార్యక్రమానికి వినియోగించనున్నారు.