Rashmika Mandanna: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అప్పుడప్పుడు చేసే కామెంట్లతో భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికో లేదా ఇప్పుడు చేస్తున్న పనులను తోసిపుచ్చుకోవడానికో తెలియదు కానీ అప్పుడప్పుడు వీళ్ళు చేసే కామెంట్లు మాత్రం వ్యతిరేకతను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika mandanna) చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
“వి ది ఉమెన్” ఫెస్టివల్ లో రష్మిక..
అసలు విషయంలోకి వెళితే వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న రష్మిక ఇటీవల లండన్ లో జరిగిన “వి ది ఉమెన్” ఫెస్టివల్ లో మాట్లాడుతూ తన కెరియర్ గురించి, పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే సవాల గురించి మాట్లాడింది. అంతేకాదు తాను స్మోకింగ్ ను ప్రోత్సహించనని, ఒకవేళ చేయాల్సి వస్తే సినిమాను కూడా వదులుకుంటాను అంటూ ఆమె స్పష్టం చేశారు.
అలా చేయాల్సివస్తే సినిమానైనా వదులుకుంటా – రష్మిక
ఇదే విషయంపై రష్మిక మాట్లాడుతూ..” నేను వ్యక్తిగతంగా తెరపై లేదా నిజజీవితంలో స్మోకింగ్ చేయను. ఎందుకంటే నాకు స్మోకింగ్ అనే కాన్సెప్టే అసలు నచ్చదు. అది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఒకవేళ ఎవరైనా వచ్చి సినిమాలో మీరు స్మోక్ చేయాలని అడిగితే మాత్రం.. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ రష్మిక చెప్పింది. అయితే ఇప్పుడు ఈమె ఆన్ స్క్రీన్ లో స్మోకింగ్ చేయనని, అలా సినిమా చేయాల్సి వస్తే సినిమానైనా వదులుకుంటానని రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
అడ్డంగా దొరికిపోయిన రష్మిక..
అయితే దీనిపై ఇప్పుడు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో రష్మిక చేసిన ‘భీష్మ’ సినిమాలో ఆమె స్మోక్ చేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఒక సాంగ్లో ఆమె వైన్ తాగడమే కాకుండా స్మోక్ చేసినట్లుగా కూడా చూపించారు. ఈ విషయాన్ని ఈమె మర్చిపోయిందా అంటూ అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇది చూసిన కొంతమంది నెటిజన్లు.. అరే రష్మిక మందన్న ఇలా అడ్డంగా దొరికిపోయావే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్స్ కి గురైందని చెప్పవచ్చు.
అండగా అభిమానులు..
అయితే రష్మికపై ట్రోల్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు ఇలా స్పందిస్తున్నారు. ఆమె ధూమపానం చేసింది అంటున్నారు అది ఈ – సిగరెట్ మాత్రమే అని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది ఆమె ధూమపానం చేసినా పొగ రాలేదు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా ఎవరికి వారు రష్మిక చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు