BigTV English

Pawan Kalyan:గింజలతో పవన్ ముఖచిత్రం.. అభిమానం చాటుకున్న చిత్తూరు వాసీ!

Pawan Kalyan:గింజలతో పవన్ ముఖచిత్రం.. అభిమానం చాటుకున్న చిత్తూరు వాసీ!

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. పెద్ద ఎత్తున ఆయన కటౌట్లతో థియేటర్లను ముస్తాబు చేస్తూ వేడుకలకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానులు కూడా ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం గత మూడు రోజులుగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.


గింజలతో పవన్ ముఖచిత్రం..

ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో హరిహర వీరమల్లు జాతర జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యేలు కూడా ఈ సినిమా వేడుకలలో భాగమవుతున్నారు. హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్తూరు (Chittor)జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయంలో (Janasena Party Office) వివిధ రకాల గింజలతో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి పవన్ ముఖ చిత్రాన్ని పూరి ఆర్ట్స్ పురుషోత్తం (Poori Arts Purushottam)ఎంతో అద్భుతంగా వేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలి అంటూ చిత్తూరు జనసేన పార్టీ ఇన్చార్జి నరేష్ కుమార్ ఆకాంక్షించారు.


సనాతన ధర్మ పరిరక్షకుడు…

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. పవన్ కళ్యాణ్ సోలో హీరోగా నటించిన సినిమా చూడటం కోసం అభిమానులు చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు అయితే ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఇలాంటి ఒక హిస్టారికల్ సినిమా ద్వారా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

డిప్యూటీ సీఎం హోదాలో..

ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో వీరమల్లు అనే పాత్రలో కనిపించబోతున్నారు అయితే ఇందులో కూడా ఈయన సనాతన ధర్మ పరిరక్షకుడుగా కనిపిస్తారని తెలుస్తోంది. సనాతన ధర్మాన్ని  కాపాడటం కోసమే కోహినూరు డైమండ్ దొంగలించే వ్యక్తిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ (Nidhi Agerwal)నటించారు. డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికి భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ కలెక్షన్లను కొల్లగొట్టబోతున్నారని స్పష్టమవుతుంది.డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ నటించిన మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి కూడా ఎంతో ప్రత్యేకంగా మారిందని చెప్పాలి.

Also Read: SIIMA Awards 2025: సైమా అవార్డ్స్ 2025 నామినేషన్స్ లో సత్తా చాటిన పుష్ప 2!

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×