BigTV English

Hari Hara Veeramallu : వాళ్లతో పోలిస్తే, తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ మారాల్సిన పరిస్థితి వచ్చిందా.?

Hari Hara Veeramallu : వాళ్లతో పోలిస్తే, తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ మారాల్సిన పరిస్థితి వచ్చిందా.?

Hari Hara Veeramallu : ఇండియాలో చాలా ఫిలిం ఇండస్ట్రీలు ఉన్నాయి. ఒకప్పుడు కొంతమంది ప్రముఖులు మాత్రమే ఇండియన్ సినిమా అని మాట్లాడేవారు. కానీ ఎక్కువ శాతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అంటూ మాట్లాడేవాళ్లు. కానీ ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా తెరకెక్కించిన తర్వాత ఇండియన్ సినిమా గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.


తెలుగు సినిమా స్థితి గతులను మార్చేసాడు రాజమౌళి. తెలుగు సినిమాకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. అయితే చాలామంది మిగతా ఇండస్ట్రీ ప్రేక్షకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రేక్షకులను ఆకాశానికి ఎత్తేస్తారు. విపరీతమైన ప్రశంసలు కురిపిస్తారు. తెలుగు ఆడియన్స్ ను మించిన ఆడియన్స్ లేరు అంటూ పొగుడుతుంటారు. ఇవన్నీ కూడా వాస్తవాలు.

తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ మారాలి 


భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను ఎంకరేజ్ చేయడం తెలుగు ఆడియన్స్ అలవాటు చేసుకున్నారు. థియేటర్లో తెలుగు సినిమాల కంటే ఎక్కువ మలయాళం సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలానే తమిళ సినిమాలు కూడా విపరీతంగా చూస్తుంటారు. పొరుగింటి పుల్లకూర రుచి అనేదానికి మనవాళ్లే నిదర్శనం. అని మిగతా ఇండస్ట్రీలో అలా లేదు. మన సినిమాలకు తక్కువ థియేటర్లు ఇస్తారు. మన సినిమాలకు అసలు ప్రయారిటీ ఇవ్వరు. ఇంకా కన్నడలో అయితే ప్రస్తుతం పరిస్థితి దారుణంగా తయారయింది. వాళ్ల భాష మీద ఉన్న ప్రేమతో మిగతా భాష ను గౌరవించాలి అని మినిమం సెన్స్ కూడా లేకుండా మారిపోతున్నారు కొంతమంది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో తెలుగులో బ్యానర్ కట్టారని కన్నడలో ఆ బ్యానర్ థియేటర్ దగ్గర చింపేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనం మాత్రం సెలబ్రేట్ చేస్తాం 

తెలుగు ప్రేక్షకులు మాత్రం ఎటువంటి సినిమానైనా ఆదరిస్తారు. ఆ సినిమా బాగుంది అనే టాక్ వస్తే దానికి బ్రహ్మరథం పడతారు. మనం కే జి ఎఫ్ సినిమాకు బ్రహ్మరథం పట్టాము. కాంతర సినిమాను విపరీతంగా ఆదరించాము. కానీ మన తెలుగు సినిమాలకే సరైన గౌరవం కన్నడలో దక్కడం లేదు. కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే కాదు, చాలామంది నటులకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. సిద్ధార్థ ను ప్రెస్ మీట్ నుంచి వెళ్లగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే తమిళ్లో కూడా సరిగ్గా మన సినిమాలకు థియేటర్స్ దొరకవు. ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకులు మైండ్ లో పెట్టుకొని వ్యవహరిస్తారా, మన సినిమాలుకు అన్యాయం జరిగిన పర్లేదు అంటూ ఇదే శైలిని కొనసాగిస్తారా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

Also Read: Mega157 Update: మెగాస్టార్ రిటర్న్స్, ఇదేం స్పీడ్ అయ్యా రావిపూడి

Related News

Samantha: మరోసారి ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ స్టెప్పులు వేయనున్న సమంత.. తగ్గట్లేదుగా?

Film industry: ఏంటీ.. ఈ హీరోయిన్ స్కూల్ లో ఉన్నప్పుడే హీరోయిన్గా చేసిందా?

Rajamouli: బయటపడ్డ రాజమౌళి కొత్త సెంటిమెంట్.. హీరోల మెడలో ఆ లాకెట్ ఉండాల్సిందేనా?

SSMB29 Firts Look: ఓర్నీ రాజమౌళి మళ్లీ కాపీ కొట్టాడు కదా… ఏకంగా పవన్‌ కళ్యాణ్‌నే టచ్ చేశాడు

Spirit Villain : స్పిరిట్ దిమ్మతిరిగే ట్విస్ట్… ప్రభాస్‌కు విలన్ సందీప్ రెడ్డి వంగనే ?

SSMB 29: మహేష్ బర్తడే స్పెషల్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జక్కన్న!

Big Stories

×