Hari Hara VeeraMallu : పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో రిలీజ్ కావలసి ఉంది. కానీ రకరకాల కారణాల వలన ఈ సినిమా వాయిదా అవుతూ వచ్చింది. ఈ సినిమా ఎవరి వలన వాయిదా పడిందో అందరికీ తెలుసు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనౌన్స్ చేసినప్పుడు అందరికీ మంచి హై అనిపించింది.
ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కూడా విపరీతంగా ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాల్లో ఉండబోతున్నాయి అని మొదటి వీడియోతోనే అర్థమయిపోయింది. అంతేకాకుండా మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు అంటేనే అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి. వకీల్ సాబ్ సినిమా తర్వాత ఈ సినిమా విడుదలవుతుంది అని అందరూ ఊహించారు.
వాయిదాకు కారణాలు
ఈ సినిమా ఎందుకు వాయిదా పడింది అంటే చాలామందికి తెలిసిన ఏకైక కారణం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం వలన. మరోవైపు రాజకీయాల్లో బిజీ అయిపోవడం వలన. అయితే దీనిలోని ఒక కొత్త విషయాన్ని బయటకు చెప్పింది హీరోయిన్ నిధి అగర్వాల్. సినిమా స్టార్ట్ అయిన తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వలన రెండు సంవత్సరాలు పోయాయి. అంతేకాకుండా పిరియాడిక్ సినిమా అంటేనే టైం పడుతుంది. కేవలం పవన్ కళ్యాణ్ వలన లేటు కాలేదు. ఆయన సెట్ లో చాలా కష్టపడేవాళ్ళు. ఒక్కసారి సెట్ కు వచ్చిన తర్వాత మరో పని పట్టించుకునే వాళ్లే కాదు. కేవలం సినిమా మీదే ఫోకస్ చేసేవాళ్ళు. అంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
ఇంకా కవరింగ్ ఎందుకు
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా చాలా సెట్స్ తాడేపల్లిగూడెం దగ్గర్లో వేసినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కి టైం దొరక్కగానే అక్కడికక్కడే షూటింగ్ జరుపుకునే లాగా ప్లాన్ కూడా చేశారు. వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు సినిమాలను పూర్తి చేశారు. ఆ రెండు సినిమాలు ఊహించిన సక్సెస్ అందుకోలేదు అది వేరే విషయం. హరిహర వీరమల్లు సినిమా లేట్ అవ్వడానికి కారణం నూటికి నూరుపాళ్ళు పవన్ కళ్యాణ్ అని చాలామంది అభిప్రాయం.
ఈ సినిమాకి సరిగ్గా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడం వల్లనే క్రిష్ జాగర్లమూడి కూడా తప్పుకోవలసి వచ్చింది. మొత్తానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఈ సినిమా జులై 24న ప్రేక్షకులు ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి వెళ్లిపోయిన తర్వాత ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. చిత్ర యూనిటీ సినిమా మీద విపరీతమైన నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది రిలీజ్ రోజు తెలుస్తుంది.
Also Read: Vishwambhara : కేవలం గాలిలోనే నటించాడు, విశ్వంభర కోసం ఆ నటుడు అంత కష్టపడ్డాడా.?