Pawan kalyan : ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హావా నడుస్తుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతిష్టాత్మకమైన బ్యానర్స్ లో హోంబలే ఫిల్మ్స్ ఒకటి. ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ , క్లీమ్ ప్రొడక్షన్స్‌తో ఒక యానిమేటెడ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ సినిమా జులై 25న ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇదివరకే విడుదల అయింది. స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యానిమేటెడ్ చిన్న పిల్లలను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.
వీరమల్లుకు పోటీగా
పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు జులై 24న ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం నిర్వహించనుంది చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం రిలీజ్ చేసిన తెలుగు ట్రైలర్ మహావతార నరసింహ దీనికి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే స్టోరీ కొంచెం ఆసక్తికరంగా ఉండటం వలన ఆ ఫీల్ క్రియేట్ అవుతుంది. అత్యాధునికమైన యానిమేటెడ్ తో దీనిని డిజైన్ చేశారు.
పవన్ కు పోటీగా అల్లు వారి సినిమా
మహవతార్ నరసింహ సినిమాని గీత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుంది. ఇదివరకే మిగతా భాషల్లో ఎన్నో హిట్ అయిన సినిమాలను గీత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందించింది. గతంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన కాంతారా సినిమాను కూడా తెలుగు ప్రాక్టికల్ కు అందించింది ఈ సంస్థ. ప్రస్తుతం ఇదే సంస్థ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాను కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది.
పవన్ కళ్యాణ్ సినిమా జులై 24న విడుదల అవుతున్న తరుణంలో, జులై 25న ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు అని కొంతమంది మెగా అభిమానుల అభిప్రాయం. పొరపాటున హరిహర వీరమల్లు రిజల్ట్ తేడా వస్తే ఈ సినిమాకి ప్లస్ అవుతుంది అనేది వాళ్ల ఆలోచన కావచ్చు. ఏదేమైనా హరిహర వీరమల్లు సినిమా మీద కొంత మేరకు ఈ సినిమా కలెక్షన్లు ప్రభావం చూపిస్తుందనేది వాస్తవం.
Also Read : Vishwambhara : కేవలం గాలిలోనే నటించాడు, విశ్వంభర కోసం ఆ నటుడు అంత కష్టపడ్డాడా.?