BigTV English

Vishwambhara : కేవలం గాలిలోనే నటించాడు, విశ్వంభర కోసం ఆ నటుడు అంత కష్టపడ్డాడా.?

Vishwambhara : కేవలం గాలిలోనే నటించాడు, విశ్వంభర కోసం ఆ నటుడు అంత కష్టపడ్డాడా.?

Vishwambhara : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో విశ్వంభర ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడే చాలామందికి విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. బింబిసారా వంటి సినిమా తర్వాత వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారు కాబట్టి సినిమా ఆ జోనర్ లోనే ఉంటుంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు.


ఇక మెగాస్టార్ చిరంజీవితో వశిష్ట చేయబోయే సినిమా సోషియో ఫాంటసీ జోనర్ అనే తెలియగానే, అందరూ జగదేకవీరుడు అతిలోకసుందరి టైప్ లో ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. అయితే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తర్వాత మెగాస్టార్ ఆ జోనర్లో అంజి సినిమా చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు మెగాస్టార్ ఆ జోనర్ లో అసలు సినిమా కూడా చేయలేదు. అందుకే ఆ జోనర్ ఎంచుకున్నాడు వశిష్ట.

కేవలం గాలిలోనే నటించాడు 


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న విలక్షణమైన నటులలో రావు రమేష్ ఒకరు. ముఖ్యంగా శ్రీకాంత్ అడ్డాల సినిమాలలో రావు రమేష్ నటించిన తీరు అద్భుతంగా ఉంటుంది. మంచి పాత్రలు శ్రీకాంత్ అడ్డాల రావు రమేష్ కు రాస్తారు. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో కూడా రావు రమేష్ కు మంచి పాత్రలో లభిస్తాయి. అయితే దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ ఇప్పటివరకు రావు రమేష్ చేసిన పాత్రలు అన్నీ ఒకవైపు, విశ్వంభర సినిమాలో ఆయన చేసిన పాత్ర ఒకవైపు అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో శిశువు అనే పాత్రలో కనిపిస్తున్నారు రావు రమేష్. అయితే కేవలం గాల్లో మాత్రమే ఈయన నటించారు. ఈయనకు సగం బాడీ మాత్రమే ఈ సినిమాలో ఉంటుంది. చాలామంది కొన్నిసార్లు క్రేన్ సహాయంతో ఈయనను లేపి షూటింగ్ చేశారట. కొన్ని గుహల్లో షూటింగ్ చేసినప్పుడు కొంతమంది రోప్స్ తో పట్టుకునేవారు. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కానీ చేయబోయే సినిమాల్లో కానీ ఇంతకుమించి పాత్ర రాదు అంటూ వశిష్ట తెలిపారు.

టీజర్ ను కావాలనే టార్గెట్ చేశారు 

టీజర్ విడుదలైనప్పుడు విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. రావాల్సిన దానికంటే కూడా నెగిటివిటీ ఎక్కువగా వచ్చింది. నాకు కావాలనే టార్గెట్ చేస్తున్నారు అనిపించింది. అయితే వీళ్ళందరికీ నేను ట్రైలర్ తో సమాధానం చెబుతాను. టీజర్ మేము చూసినప్పుడు ఒకలా అనిపించింది కానీ టీవీలో చూసినప్పుడు అది కలర్ ఏదో మారిపోయింది. విమల్ థియేటర్లో చూసినప్పుడు అసలు ఎటువంటి కంప్లైంటు రాలేదు అంటూ వశిష్ట చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి సంబంధించి కేవలం ఒక సాంగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది అంటూ తెలిపారు. త్రిష ఈ సినిమాలో చాలా అందంగా కనిపించబోతున్నట్లు వివరించారు.

Also Read: SSMB29 : ఏకంగా జక్కన్నకు చేంజెస్ చెప్పాడు, అందుకే రాజమౌళి స్టార్ హీరోలతో ఇప్పటివరకు పని చేయలేదు

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×