Nidhhi Agerwal: టాలీవుడ్ ఇండస్ట్రీకి నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో పరిచయమైంది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్.. ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది కానీ అంత బ్రేక్ రాలేదు.. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ సినిమాతో ఆమె రేంజ్ పెరిగింది.. ఆ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.. కేవలం తెలుగులో మాత్రమే కాదు అటు తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన జోడిగా నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమా చేస్తుంది. అలాగే ప్రభాస్ కి జోడిగా రాజా సాబ్ మూవీ చేస్తుంది.. తాజాగా ఈమె ఫ్యాన్స్ తో ఆస్క్ నిధి పేరు చాట్ చేసింది. ఈ క్రమంలో కోలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ఆమెను అడిగారు.. దానికి ఆమె చెప్పిన సమాధానం తో నెటిజన్స్ అంతా షాక్ అయ్యారు.. అయితే తాజాగా నిధి ఓ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేసింది..
అడ్డంగా బుక్కయిన నిధి అగర్వాల్..
హరి హర వీరమల్లు సినిమాతో నిధి అగర్వాల్ ఇక సందడి చేసేందుకు రెడీగా ఉన్నారు. చాలా రోజుల నుంచి ఈ టైం కోసమే ఆమె ఎదురుచూస్తోన్నారు. నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాతో ప్రేక్షకులను ఎప్పుడు పలకరిద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎట్టకేలకే నిధి ఎదురుచూపులకు ఫలితం దక్కబోతోంది. ఈ నెల 24న వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతోంది.. వీరమల్లు సినిమా ప్రమోషన్స్ కోసం నిధి కూడా సిద్దం అవుతోంది. సోషల్ మీడియాలో తన స్టైల్లో నిధి సెల్ఫ్ ప్రమోషన్ కూడా చేసుకుంటున్నారు. తాజాగా తన ట్విట్టర్ ఫాలోవర్లతో నిధి పాప చిట్ చాట్ చేసింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపిగ్గా సమాధానం చెప్పింది.. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఫెవరెట్ కోలీవుడ్ హీరోల గురించి అడిగారు. దానికి నిధి పవన్ కళ్యాణ్, ప్రభాస్ అని సమాధానం చెప్తుంది. దాంతో వాళ్ళు కోలీవుడ్ కాదు.. టాలీవుడ్ అని ట్రోల్స్ చేస్తున్నారు.
తప్పు అయ్యింది క్షమించండి..
హీరోయిన్ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇక తన సినిమాల గురించి అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. తాజాగా ఈమె నెటిజన్స్ తో చేసిన చాట్ చేసింది. ఈ క్రమంలో మళ్లీ పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లతో నటిస్తారా? అని అడిగితే.. మళ్లీ వారిద్దరితో కలిసి నటించే అవకాశం రావడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి.. అవకాశం వస్తే వాళ్లిద్దరితో మళ్లీ నటిస్తాను అని నిధి పాప చాలా ఎగ్జైట్ అయ్యింది. కోలీవుడ్‌లో నీకు ఇష్టమైన హీరో ఎవరు? అని అడిగితే.. పవన్ కళ్యాణ్ ప్రభాస్ అని చెబుతుంది.. వాళ్లు కోలీవుడ్ కాదు.. టాలీవుడ్ అని ట్రోల్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ట్రోల్స్ పై ఆమె స్పందించింది. నేను క్వశ్చన్ ని తప్పుగా చదివాను. నాదే క్షమించండి అంటూ ట్వీట్ చేసింది. కోలీవుడ్ లో నేను చాలామందితో నటించాను.. అందరూ నాకు ఇష్టమే.. అయితే రీసెంట్‌గా టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూశాను.. అది నాకు చాలా నచ్చింది అంటూ నిధి అగర్వాల్ ట్వీట్ లో రాసింది. ఈ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేసింది.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ అవుతుంది..
So sorry I misread the question! 🙈
There are SO many actors whose work I love and so many legends who I look up to.. Difficult to choose one but I watched this film Tourist Family recently that I loved ❤️☺️— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) July 7, 2025