Cuddalore Train Incident: తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోరం జరిగింది. ప్రైవేట్ స్కూల్ బస్సును రైలు ఢీకొనడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. కడలూరు సెమ్మన్ కుప్పం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
కడలూరు సమీపంలో ఉన్న ఓ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని పట్టాలను దాటుతుంది. అయితే రైలు రావడం గమనించని సిబ్బంది.. గేట్ వేయకపోవడంతో స్కూల్ బస్సు పట్టాలను క్రాస్ చేసే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే వేగంగా వచ్చిన రైలు.. స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు ఢీకొన్న వేగానికి స్కూల్ బస్సు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడి… పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. రెస్క్యూ బృందాలు మరియు అత్యవసర సేవలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని వైద్య సహాయం కోసం అక్కడి సమీపంలోని కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: గొర్రెలు కాసే అమ్మాయిని అడవిలోకి తీసుకెళ్లి.. ఐదుగురు కిరాతకంగా..
అయితే గేటు వేయడంలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో తక్కువ మంది ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే ఎంత ఘోరం జరిగేదో ఊహించడానికే భయం కలుగుతోందని స్థానికులు అంటున్నారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.