BigTV English

Viral Video: ఇలాంటి భార్య మీకు కావాలా? ఆ సర్ ప్రైజ్ లు భరించలేక పారిపోతారేమో!

Viral Video: ఇలాంటి భార్య మీకు కావాలా? ఆ సర్ ప్రైజ్ లు భరించలేక పారిపోతారేమో!

సృష్టిలో భార్యా భర్తల బంధం ఎంతో బలమైనది. తాళి కట్టి, చేయి పట్టినప్పటి నుంచి చివరి కట్టె కాలే వరకు కలిసి జీవితాన్ని పంచుకుంటారు. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు అన్నింటిలో చేదోడు, వాదోడుగా ఉంటారు. అయితే, పిల్లలు పెద్దవాళ్లైన తర్వాత, వారికి రెక్కలొచ్చి ఎగిరిపోయిన తర్వాత, వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా బతుకీడుస్తుంటారు. తమను తాము సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అలాంటిదే. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే భర్తకు రోజుకో వెరైటీ గెటప్ లో ఆటపట్టిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


వెరైటీ గెటప్ లతో భర్తను సర్ ప్రైజ్ చేస్తున్న భార్య

రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన భర్తను సంతోషంగా చూడాలనుకుంటుంది ఓ భార్య. ఇందుకోసం రోజు ఓ వెరైటీ గెటప్ వేసుకుని డోర్ దగ్గర నిలబడుతుంది. భర్త ఆఫీస్ నుంచి రాగానే, డోర్ తీసి సర్ ప్రైజ్ చేస్తుంది. భర్త ఆమెను చూసి కొన్నిసార్లు పట్టించుకోనట్లు కనిపించినా, మరికొన్నిసార్లు తన భార్య తనకోసం చేసే అల్లరి పనులకు ఫిదా అయిపోతాడు. బుగ్గ మీద ముద్దు పెట్టి తన ప్రేమను తెలియజేస్తాడు.


గిటార్ వాయిస్తూ వెల్ కం పలకడం, టిష్యూ పేపర్ ను మీదకు విసరడం, కోక్ లో ట్యాబ్ లెట వేసి పొంగేలా చేయడం, జలకన్య రూపంలో అలరించడం, ఇంటికి రాగానే పేపర్ బాంబ్ పేల్చడం, శాంతా క్లాజ్ గా రెడీ అయి ఆకట్టుకోడం, ఒకటేమిటీ సవాలక్ష గెటప్ లు వేస్తుంది ఈ ఇల్లాలు. చివరకు భార్యకు సర్ ప్రైజ్ ఇవ్వాలని భావిస్తాడు భర్త. బర్గర్ స్టైల్ డ్రెస్ వేసుకుని ఇంటికి వచ్చిని భార్యను ఆశ్చర్యపరుస్తాడు. పనిలో పనిగా చేతిలో సార్స్ బాటిల్స్ కూడా పట్టుకొని వస్తాడు. భర్త చేసిన పని చూసి భార్య సంతోషంలో మునిగిపోతుంది.

Read Also:  తిరుమల లైన్ లో ఉన్నప్పుడు అలా చేస్తారా? అమ్మవారికి అవే నైవేద్యం.. వేణుస్వామి అనుచిత వ్యాఖ్యలు!

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇక ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. భార్యాభర్తల అలర్ల పనులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భార్యభర్తలు అంటే ఇలా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. మరికొంత మంది ఈ వీడియోపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. రోజూ ఇలా సర్ ప్రైజ్ అంటే  భర్తలు పారిపోతారేమో? అని కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, రోజూ అదే పని అయితే బోర్ కొడుతుందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు బాగా అలరిస్తోంది.

Read Also:  ఈ వైరల్ ఫొటోలో ఉన్న పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? చూస్తే షాకవుతారు!

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×