E-Paper
Advertisement

శుభమాన్ గిల్ త‌ల‌కు ఏమైంది? ఆ ఎల‌క్ట్రిక్ డివైజ్ ఎందుకు పెట్టుకున్నాడు

శుభమాన్ గిల్ త‌ల‌కు ఏమైంది? ఆ ఎల‌క్ట్రిక్ డివైజ్ ఎందుకు పెట్టుకున్నాడు
Advertisement

Shubman Gill – Temple Brain-Monitoring Device :  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య త్వరలోనే వన్డే సిరీస్ ( India tour of New Zealand 2026) ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో భారత వన్డే కెప్టెన్ శుభ‌మాన్ గిల్ వన్డే సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ సందర్భంగా అతడు తలకు అరుదైన ఎలక్ట్రానిక్ డివైస్ ధరించి కనిపించాడు. దీంతో కెప్టెన్ శుభ‌మాన్ గిల్ కు ఏమైంది ? తలకు ఆ డివైస్ ఎందుకు పెట్టుకున్నాడు ? అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అతడికి ఏదైనా అనారోగ్యం సమస్య తలెత్తిందా ? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని చర్చిస్తున్నారు.

శుభ‌మాన్ గిల్ తలకు పెట్టుకున్న ఎల‌క్ట్రానిక్ డివైస్ ఏంటి..?

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కంటే ముందు ప్రాక్టీస్ పై కెప్టెన్ శుభ‌మాన్ గిల్ దృష్టి సారించాడు. ఈ సందర్భంగా తన తలకు టెంపుల్ అనే బ్రెయిన్ మానిటరింగ్ వేరబుల్ డివైస్ (Temple Brain-Monitoring Device ) ధరించాడు. దీన్ని పెట్టుకునే ప్రాక్టీస్ లో గిల్ మెరిశాడు. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ నేతృత్వంలోని హెల్త్ టెక్ కంపెనీ ఈ టెంపుల్ డివైస్ తయారు చేసింది. చాలా మంది డిజిటల్ వాచ్ లు, రింగులు వాడి తమ ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. కానీ ఈ టెంపుల్ డివైస్ అలా కాదు. ఒక టాబ్లెట్ తరహాలో ఈ డివైస్ ను రూపొందించారు. నుదుట‌, లేదా చెవికి మధ్య టెంపుల్ డివైస్ అంటించుకోవాలి.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

ఈ టెంపుల్ డివైస్ ఉప‌యోగాలు

ఈ టెంపుల్ డివైస్ లోని ఆప్టికల్ సెన్సార్లు మెదడులో జరిగే రక్త ప్రసరణ, ఆక్సిజన్ లెవెల్స్ పైన అధ్యాయనం చేస్తాయి. వాటిని నిరంతరం ట్రాక్ చేసి… హెల్త్ కండిషన్ రిపోర్టు అందిస్తాయి. అలాగే ప్లేయర్ల మానసిక అలసట శారీరక ఒత్తిడిని కూడా గుర్తించి సిగ్నల్స్ ఇస్తుంది. క్రికెటర్లు ఇతర క్రీడాకారులకు ఈ డివైస్ చాలా ఉపయోగపడుతుందని నివేదికలు చెబుతున్నాయి. దీని ధర 85 వేల రూపాయలుగా ఉంది. టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య మూడు టి20 లు జరిగాయి. ఇందులో మూడింటిలో గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇక నవంబర్ 4వ తేదీ నుంచి వన్డే సిరీస్ షురూ అవుతుంది. న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొత్తం ఐదు వన్డేలు జరగనున్నాయి. అయితే ఇందులో మొదటి 3 వన్డేలు మాత్రమే కెప్టెన్ గిల్ ఆడతాడు. మిగిలిన వ‌న్డేల‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తాడు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

 

 

Related News

బంతులు వేస్తే, బ్యాట‌ర్ల ముక్కు, ద‌వ‌డ‌ల‌ నుంచి ర‌క్తం రావాలి…షోయ‌బ్ అక్తర్ సంచ‌ల‌నం !

కాళ్లు మొక్కినా ఆ జ‌ట్టులోకి వెళ్ల‌ను…హార్ధిక్ పాండ్యా సంచ‌ల‌నం !

పాకిస్తాన్ తిక్క కుదిర్చిన ఇంగ్లాండ్..ఐపీఎల్ ఆడేందుకు జై కొట్టిన ప్లేయ‌ర్లు

తెరపైకి శాండ్ పేపర్ వివాదం..బౌండరీ లైన్ దగ్గర నాథన్ లైయన్ ఆడుకున్న ఫ్యాన్స్

సంజీవ్ గోయెంకాకు బుర్రే లేదు..కెప్టెన్సీ పీకేసి ధోనిని అవమానించాడు!

న్యూజిలాండ్, టీమిండియా సిరీస్ పై ICC వెంట‌నే విచార‌ణ చేయాలి!

డారిల్ మిచెల్ గుండు నుంచి పొగ‌లు.. పొయ్యిలో కూర్చున్నాడా ఏంటి?

Big Stories

Advertisement
×