Niharika: నిహారిక కొణిదెల(Niharika Konidela) పరిచయం అవసరంలేని పేరు. మెగా వారసురాలిగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. నాగబాబు(Nagababu) కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ఈమె సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. నిహారిక నిర్మాణ సంస్థలో కమిటీ కుర్రోళ్ళు సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఇటీవల ఈమె గద్దర్ ఫిలిం అవార్డును(Gaddar Film Award) కూడా సొంతం చేసుకున్నారు. నిర్మాతగా మొదటి ప్రయత్నంలోనే నిహారిక సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.
నిర్మాతగా సక్సెస్…
ప్రస్తుతం ఈమె ఇతర భాషా సినిమాలలో నటిస్తూ నటిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న నిహారిక తన వ్యక్తిగత జీవితానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారని చెప్పాలి. తనకు ఏమాత్రం విరామం దొరికిన తన స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా తన స్నేహితులతో(Friends) కలిసి గడిపిన క్షణాలకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
రోజంతా స్నేహితులతోనే….
తాజాగాని హారిక సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈరోజు మొత్తం తన సమయం తన స్నేహితులతో గడపడానికే ఇష్టపడుతున్నానని ఈమె ఈరోజు తన స్నేహితులతో ఎలా గడపాలనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మొదలుకొని ఏ టైం కి ఏం చేయాలనే విషయాలను తెలియ చేశారు . ఏడు గంటలకు నిద్ర లేచి బ్రష్ చేసిన తర్వాత తన పనులు పూర్తి చేసుకుని ఒంటిగంటకు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాలని తెలిపారు. ఇలా స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ వారితో కలిసి భోజనం చేయాలని , ఈరోజు మొత్తం నా బెస్టీస్ తో గడపాలనుకుంటున్నట్లు ఈమె తెలియజేశారు.
?utm_source=ig_web_copy_link
తమిళ సినిమాలలో ఛాన్స్…
ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా నిహారిక స్నేహితులతో కలిసి తన రోజున ఎంజాయ్ చేయటానికి అద్భుతమైన ప్లాన్ చేశారని తెలుస్తుంది . నిత్యం సినిమా షూటింగులు ప్రొడక్షన్ పనులు అంటూ ఎంతో బిజీబిజీగా గడిపే నిహారిక తనకు వీలైనప్పుడు ఇలా స్నేహితులతో తన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే కమిటీ కుర్రాళ్ళతో హిట్ కొట్టిన నిహారిక తదుపరి సినిమా కోసం మంచి కథలను వినే పనిలో ఉన్నారు. మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాంకర్ గా, హీరోయిన్ గా, నిర్మాతగా కొనసాగుతూ నిహారిక బిజీగా గడుపుతున్నారు. ఇక తెలుగులో ఈమె నటించిన మూడు సినిమాలు హీరోయిన్గా తనకు ఏమాత్రం గుర్తింపు ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలోనే ఇటీవల మద్రాస్కరన్ అనే తమిళ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించలేకపోయింది.
Also Read: నేను హిందూ.. నా భార్య క్రిస్టియన్.. కన్నప్ప విడుదల వేళ అవసరమా విష్ణు?